పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ

Jan 26,2024 14:04 #Kurnool
house distribution in kurnool

రైతు భరోసా కేంద్రం, ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంక్, వై ఎస్ అర్ హెల్త్ క్లీనిక్ ప్రారంభం
చిన్నటేకురులో రైతు భరోసా కేంద్రం వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్ : జగనన్న కాలనీలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. గురువారం కల్లూరు మండలం చిన్నటేకురు, గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం,, వై ఎస్ ఆర్ గ్రామీణ అరోగ్య కేంద్రం వై సి పి మండల కన్వీనర్ కెపి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో, బస్తిపాడులో ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంక్, రైతు భరోసా కేంద్రం, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ ను కె డి సి సి బ్యాంక్ డైరెక్టర్ కల్లా వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ప్రారంభించి 230 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఇంటి స్థలాలలో నిర్మాణాలు ప్రారంభించాలని కోరారు. కెవి రమణ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మొదటి విడతలో 270 మందికి, రెండవ విడతలో 230 మందికి పట్టాలు పంపిణీ చేసి ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రజల సమస్యను పరిష్కరించామని తెలిపారు. అందుకు సహకరించిన ఎమ్మెల్యే కాటసానికి, అధికారులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఓ జివి రమణ మూర్తి, తహశీల్దార్ టి వి రమేష్ బాబు, సర్పంచ్ లు బి మద్దిలేటి, భూపాల్ రెడ్డి, బి ఘణ మద్దిలేటి లక్ష్మన్న, మండల ఉపాధ్యక్షులు నాయకల్ చంద్రారెడ్డి ఎం పి టి సి లు నాగేశ్వర రావు మునిస్వామి, నక్క సామన్న, నాయకులు పెద్దపాడు శ్రీధర్ రెడ్డి ఉలిందకొండ రమణ రెడ్డి, నారాయణ, సత్యంరెడ్డి, కేశవరెడ్డి కృష్ణారెడ్డి హనుమంతురెడ్డి రమణ రామకృషా రెడ్డి అధికారులు, గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️