శ్రీమఠంలో రాష్ట్ర మంత్రి ఉష శ్రీ చరణ్

May 23,2024 12:37 #Kurnool

ప్రజాశక్తి-మంత్రాలయం : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామిని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ భర్త అనుచర వర్గంతో కలసి గురువారం దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న ఆమెకు శ్రీ మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహ మూర్తి సహాయకులు బింధు మాధవాచార్ స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళవారం హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీ మఠంలో స్వామి వారి ప్రసాదం స్వీకరించారు.

➡️