బాండ్లు ఇచ్చిన వారి పేర్లు ప్రకటించాలి

Mar 11,2024 14:47 #Kurnool

ప్రజాశక్తి-కర్నూల్ : రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు ఇచ్చిన వారి పేర్లను ప్రకటించాలని కోరుతూ సోమవారం ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నందు నిరసన కార్యక్రమం సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుకె ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బిజెపి పార్టీకి ఎవరెవరు ఎలక్ట్రోలు బాండ్లను ఇచ్చారు వెల్లడించాలని ఉన్న ఎస్బిఐ యాజమాన్యం మోడీ కార్పొరేట్లకు తొత్తులుగా మారి పేర్లను బయట పెట్టడం లేదని ఆరోపించారు. బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్లకు అవినీతిపరులకు చట్టబద్ధత కల్పించిన ఘనత కేవలం మోడీకే దక్కుతుందని ఆరోపించారు. వెంటనే ఎవరెవరు ఎంత ఇచ్చారో, వాటి వివరాలను వెల్లడిస్తూ ఇచ్చిన ఎలక్ట్రో బాండ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం న్యూ సిటీ ఓల్డ్ సిటీ నాయకులు పాల్గొన్నారు.

➡️