ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా న్యాయవాదుల నిరసన

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి): ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూహక్కు చట్టం -2023 రద్దు చేయాలని నరసాపురం బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు చల్లా దానయ్య నాయుడు అన్నారు. గురువారం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. న్యాయవాదులు కోర్టు నుండి అంబేద్కర్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించి సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. గత 4నెలలు గా అనేక రూపాలలో న్యాయవాదులు నిరసన తెలుపుతున్న ప్రభుత్వం స్పందించటం లేదని వెంటనే భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఆర్‌ జీ.కుమార్‌, కంబాల స్వర్ణ, కొప్పినేడి పద్మజ, నెక్కంటి క్రాంతి కుమార్‌, దొంగ సుభాష్‌, , చేగొండి బాలాజీ , వెంకట రామారెడ్డి, చొడదాసి శ్రీధర్‌, పోలిశెట్టి రఘురాం నారిన శ్రీను పోలిశెట్టి సూరిబాబు, గునిసెట్టిశ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️