ప్రజలపై వైసీపీ ప్రభుత్వం మోయలేని భారాలు మోపింది : ఇండియా వేదిక నాయకులు

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : వైసిపి ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపిందని ఇండియా వేదిక నాయకులు విమర్శించారు. శనివారం మండల పరిధిలోని పందిళ్ళపల్లిలో జరిగిన ప్రచార మీటింగ్లో పలువురు నాయకులు మాట్లాడారు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పులిపాటి బాబురావు దళిత నాయకులు మాచవరపు జూలియన్‌ సిపిఎం నాయకులు పి కొండయ్య సిపిఐ నాయకులు సామేల మేరిక రమేష్‌ బాబు తమ ప్రసంగాలలో వైసిపి తిరు పై ధ్వజమెత్తారు స్థానికుడైన ఆమంచి కృష్ణమోహన్‌ ను చీరాల శాసనసభకు గెలిపించాలని బాపట్ల పార్లమెంట్‌ శీలం గెలిపించాలని విజ్ఞప్తి చేశారు,2009 నుండి2014 వరకు ఆమంచి కృష్ణమోహన్‌ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి చీరాల అభివృద్ధికి తోడ్పడ్డారని 2019 నుండి బలరామకృష్ణమూర్తి చీరాల అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చారని అభివృద్ధి కార్యక్రమాలు లేవని అందువల్ల చీరాల స్థానికుడైన కృష్ణమోహన్‌ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపిందని కరెంటు చార్జీలు పెంచిందని అమ్మ బోతే అడవి కొనబోతే కొరివి పరిస్థితి లాగా రాష్ట్రంలో తయారైందని వారు విమర్శించారు గ్యాస్‌ రేటు 400 నుండి 1200 వరకు పెంచి ప్రజల నడ్డి విరిచారని అన్ని రకాల పందుల పిచ్చారని అందువల్ల భారాల వైసీపీని ఓడించాలని కష్టం గుర్తుకు ఓడి చేయాలని హస్తం గుర్తుకు ఓటు చేయాలనికూడా వారు విజ్ఞప్తి చేశారు రామానగర్‌ వేటపాలెం దేశాయిపేట ఆమోదగిరి పట్నం జాండ్రపేట రామకృష్ణాపురం గ్రామాలలో వరుసగా సభలు జరిగాయి.

➡️