మతోన్మాద బిజెపిని ఓడిద్దాం : అల్లూరులో సిపిఎం అభ్యర్థుల ప్రచారం

May 2,2024 12:35 #Alluru, #CPM candidates campaign

ప్రజాశక్తి-విఆర్‌ పురం (అల్లూరు) : మండలంలోని ములకనపల్లి జోన్‌ పరిధిలో తెల్లంవారిగూడెం పెద్ద మట్టపల్లి, పంచాయతీ నూతి గూడెం, రేగడగుంపు, జీడిగుప్ప, పంచాయతీలోని జీడిగుప్ప దారపల్లి, ముత్యాలమ్మ, గండిలలో గురువారం రోజు సిపిఎం ఎన్నికల ప్రచారం దూసుకుపోతుంది. గ్రామంలో సి.పి.యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లోత రామారావు అరకు పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి పాచి పెంట అప్పల నర్సయ్య గుర్తులు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తులపై మీ అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. మండల ప్రజలారా ఏకమవుదాం, మతోన్మాద బిజెపి ని ఓడిద్దాం అని నినదించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, జిల్లా కమిటీ సభ్యులు పూనం.సత్యనారాయణ, పంపు సత్తిబాబు మాట్లాడుతూ …. మనదేశంలో గత పది సంవత్సరాల నుండి గద్దెనెక్కి కూర్చున్న ఓ మతోన్మాద బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులకు ఈనెల 13 వ తేదీన జరిగే అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పోలవరంకు నిధులు ఇవ్వకుండా లక్షలాదిమందిని గోదాటిలో ముంచుతున్న బిజెపిని కేసుల భయంతో పల్లెత్తు మాట అనకుండా గంగిరెద్దుల్లా తలలూపుతున్న వైసిపి, టిడిపి కూటమిని గెలిపించి మరొక్కసారి మోసపోదామా ? లేదు మనమంతా మేల్కని సిపిఎం అభ్యర్థులను గెలిపించుకుని మన ప్రాంత అభివఅద్ధికి బాటలు వేద్దామా ? అలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సి.పి.యం నాయకులు ఎంపీపీ కారం లక్ష్మి, కారం సుందరయ్య, పడ్లాది రమేష్‌, కమ్ము చిచ్చు. సత్తి బాబు, ములకనపల్లి సర్పంచ్‌ సవలం మారయ్య, కొండారెడ్డి.ముసలి సత్యనారాయణ, శాఖ కార్యదర్శి తెల్లం కన్నారావు, తెల్లం శాంతి రాజు, తెల్లం శేఖర్‌, సోయం భద్రయ్య, కారం రమేష్‌, వెట్టి చందు శాఖ కార్యదర్శి శాఖ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

➡️