వైసీపీ జెండా ఎగరేద్దాం: కరణం వెంకటేష్‌

ప్రజాశక్తి-చీరాల చీరాల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు అందరూ కృషి చేయాలని, జరగనున్న ఎన్నికలలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని కరణం వెంకటేష్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని 2వ వార్డులో పలువురు యువత రామకృష్ణపురం క్యాంప్‌ కర్యాలయంలో వెంకటేష్‌ను కలసి ఆయనకు మద్దతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో వైసిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేష్‌ను గెలిపించాలని కోరుతూ వెంకటేష్‌ సతీమణి కరణం గీత, సోదరి గోరంట్ల సుధాలు ఇరువురు మునిసిపల్‌ 7వ వార్డులో వాళ్ల కుటుంబాలను గడప గడపకూ వెళ్లి కలిసి వైసిపి కరపత్రాలు పంచుతూ వెంకటేష్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం సెయింట్‌ మార్క్స్‌ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో వారు పాల్గొన్నారు. వారి వెంట 7వ వార్డు కౌన్సిలర్‌ యాతం జ్యోతి, సునీల్‌, క్రాంతి, గొర్రెముచ్చు రాజేష్‌, చిన్న, మల్లెల లలిత రాజశేఖర్‌, అమర్తపూడి రమాదేవి, వాసిమల్ల బ్రదర్స్‌, చర్చి ఫాదర్స్‌ తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్‌కు మద్దతు తెలిపిన వారిలో కొండ్రు ప్రతాప్‌, కొండ్రు జయ కుమార్‌, కొండ్రు స్టాలిన్‌, శౌరి, సన్ని, దేవయ్య, సంతోష్‌, విక్కి, బాలు, సందీప్‌, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

➡️