ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని,అభివృద్ధిని చూసి ఓటేయ్యండి : మంత్రి బొత్స

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : వైసిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటేయ్యాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం వైసిపి విజయనగరం నియోజవర్గంలో సీనియర్‌ సిటిజన్స్‌తో ఆత్మీయ సభను స్థానిక భాష్యం స్కూల్‌ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు, అన్ని వర్గాలు ప్రజలుకు మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో నగరం ఎలా ఉంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరం ఎలా ఉందో చూడాలన్నారు. నిరంతరం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కషి చేయడం జరిగిందన్నారు. ఇటీవల తెలుగుదేశం నాయకులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను విద్యా శాఖ మంత్రి గా ఉండటంతో డ్రాప్‌ ఔట్స్‌ పెరిగాయని,నిరక్షరాస్యత పెరిగిందని అవాస్తవాలు మాట్లాడటం దారుణమన్నారు. తెలుగుదేశం పాలన కాలంలో డ్రాప్‌ అవుట్స్‌ శాతం 26 శాతం ఉంటే నేడు ఒక్క శాతం కూడా లేకుండా డ్రాప్‌ ఔట్సు లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వానిది అన్నారు. తెలియకపోతే గణాంకాలు చూస్తే తెలుస్తుందన్నారు. మరో వైపు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్‌ గజపతిరాజు విమానయశాఖ మంత్రిగా ఉండి కట్టలేకపోయారని,ఇండియన్‌ ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ నిర్మించే అవకాశం ఇవ్వకుండా ఎటువంటి అడ్డంకులు సష్టించారో ప్రజలకు తెలుసు అన్నారు.మరో రెండేళ్లలో విమానాశ్రయం నిర్మించి వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా శరవేగంగా పనులు చేస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానిది అన్నారు. మెడికల్‌ కాలేజీ మాన్సాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఆడిన డ్రామాలు ప్రజలు మ చిపొరన్నరు.మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత మాది అన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ గా ఎవరు ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలు అందించి పని చేసారో గ్రహించి మా పార్టీని,ఎమ్మెల్యే కోలగట్ల ను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం వైసిపి జిల్లా అధ్యక్షులు,జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలో పెద్ద కొడుకుగా అందరి సంక్షేమం చూసిన వ్యక్తి సీఎం జగన్మోహన్‌ రెడ్డి అన్నారు.వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్‌ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి నియోజకవర్గం అభివద్ధికి చేసిన సేవలు ప్రజలు గుర్తించాలన్నారు. ప్రజలు సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం వైసిపి ప్రభుత్వం తిరిగి వచ్చే విధంగా, ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామినీ గెలిపించాలని కోరారు.

చేసిన అభివృద్ది చేసి ఓటు వేయండి : డిప్యూటి స్పీకర్‌ కోలగట్ల

నగరంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. మేము అధికారంలోకి వచ్చేటప్పటకి ఐదు రోజులకు ఒక సారి తాగు నీరు వచ్చేది నేడు రోజు తప్పించి నీరు ఇవ్వడంతో పాటు 11 వాటర్‌ ట్యాంక్‌లు నిర్మించి ప్రజలకు దాహార్తిని తీర్చే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. వీటితో పాటు నగర పాలక సంస్థగా వృద్ధి చెందిన తర్వాత తెలుగుదేశం పాలకవర్గం చెయ్యలేని రోడ్లు,కాలువకు,చెరువులు అభివద్ది,సుందరీకరణ చేయడం జరిగిందన్నారు. టిడిపి నేతలు తాగునీటి కోసం ఏనాడైనా ఆందోళన చేశారా అని ప్రశ్నించారు. మరలా మమ్మల్ని గెలిపిస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేస్తామన్నారు. సీనియర్‌ సిటిజన్‌ పెద్దింటి అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో పార్లమెంట్‌ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్‌ , శాసనమండలి సభ్యులు డా.పెనుమత్స సురేష్‌ బాబు, మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి,ఎంపిపి మామిడి అప్పలనాయుడు, రాజాం నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకులు కె.వి సూర్యనారాయణ రాజు (పులి రాజు), జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ నారాయణమూర్తి రాజు, పెద్దింటి రామారావు, పెద్ద ఎత్తున సీనియర్‌ సిటిజెన్లు, పట్టణంలో గల వైసిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

➡️