ఎన్‌ఎడి వంతెనపై లారీ బోల్తా

May 23,2024 23:24 #accident, #lorry, #NAD
NAD, Lorry accident

 ప్రజాశక్తి -గోపాలపట్నం : నగరంలో నుంచి గాజువాక వైపు పేపర్‌ బండిల్స్‌ లోడుతో వెళ్తున్న లారీ ఎన్‌ఎడి వంతెనపై రోటరీ డివైడర్‌ రైలింగ్‌ను ఢ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్‌ గాయాలతో బయటపడ్డాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… ఒడిశా బాలాసోర్‌ నుంచి విశాఖ ఆటోనగర్‌కు పేపర్‌ బండిల్స్‌లో లారీ వస్తోంది. ఎన్‌ఎడి ఫ్లైఓవర్‌పై గురువారం రాత్రి 2:30 గంటల సమయంలో బోల్తా పడింది. ప్రమాదంలో లారీ క్లీనర్‌ బిట్టు దాస్‌(20)కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవరుకు ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. కంచరపాలెం ట్రాఫిక్‌ సిఐ ప్రసాదరావు, ఎస్‌ఐ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బోల్తా పడిన లారీలో ఉన్న పేపర్‌ బండిల్స్‌ను వేరే లారీలోకి ఎక్కించారు. లారీని పక్కకు తీసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రమబద్ధీకరించారు. లారీ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ సిఐ చక్రధరరావు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️