జోరుగా నామినేషన్లు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల నామినేషన్లు జోరు ఊపందుకుంది. మంగళవారం కడప, అన్నమయ్య జిల్లాల్లో కడప, రాజంపేట పార్లమెంట్‌ స్థానాలకు 10, అసెంబ్లీ స్థానాలకు 24 నామినేషన్లు దాఖలు చేశారు. కడప పార్లమెంట్‌ స్థానానికి ఏడు, అన్నమయ్య జిల్లాలో రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి 3 నామినేషన్లు దాఖలు చేశారు. కడప పార్లమెంట్‌ స్థానానికి వైసిపి తరుపున వైఎస్‌.అవినాష్‌రెడ్డి, బిఎస్‌పి తరుపున పందింటి గుర్రప్ప, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ తరుపున రాచినేని వేణుగోపాల్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ముడమల వెంకట సుబ్బారెడ్డి, భరోసా పార్టీ తరుపున చింతల యేసయ్య, ఆలిండియా పార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరుపున ఎ.సురేష్‌కుమార్‌రెడ్డి, జన సహాయశక్తి పార్టీ తరుపున ఎం.హనుమంతరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ తరుపున పెనుమదు ప్రదీప్‌, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరుపున మాడా రాజా, కాంగ్రెస్‌ పార్టీ తరుపున కొండేటి లీలావతి నామినేషన్‌ దాఖలు చేశారు. కడప జిల్లాలోని అసెంబ్లీ నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే కడప అసెంబ్లీకి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా అచ్చుకట్ల పానేటి సుధాకర్‌, ఇండిపెండెంట్‌గా పఠాన్‌ ఖాదర్‌బాషా, మహాజన రాజ్యం పార్టీ తరుపున హేక్‌ హుమెరా, నేషనల్‌ మహాసభ పార్టీ అభ్యర్థిగా పట్టుపోగుల పవన్‌కుమార్‌, ఇండిపెండెంట్‌గా అచ్చుకట్ల జలాలుద్దీన్‌మునీర్‌, పులివెందుల అసెంబ్లీకి టిడిపి తరుపున మారెడ్డి రవీంద్రనాధరెడ్డి, భారత్‌ చైతన్య యువజన పార్టీ తరుపున సూరే మధుసూదన, భారత్‌ చైతన్య యువజన పార్టీ తరుపున సూరే నిర్మల, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ తరపున కర్ణా రమేష్‌కుమార్‌, బద్వేల్‌ అసెంబ్లీకి ఇండిపెండెంట్లుగా తిరువీధి జయరాములు, వంకెల శ్రీని వాసులు, వైసిపి అభ్యర్థిగా తిరువాయిపాటి హరిప్రసాద్‌, వైసిపి తరు పున డాక్టర్‌ దాసరి సుధ, కమలాపురం అసెంబ్లీకి టిడిపి తరపున పుత్తా చైతన్యరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, ప్రొద్దుటూరు అసెంబ్లీకి జైభీంరావ్‌ భారత్‌ పార్టీ తరుపున తనగాని కరుణాకర్‌, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున షేక్‌ మహ్మద్‌ రఫీ, జమ్మలమడుగు అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా వెంగల జగదీశ్వరరెడ్డి, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున బచ్చుపల్లి పుల్లారెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ తరుపున సింగం సుధాకర్‌రెడ్డి, బిఎస్పీ తరుపున గుడిసెపల్లి ఓబయ్య, ఇండిపెం డెంట్లుగా అల్లె ప్రభావతి, చదిపిరాళ్ల వీరరఘునందన్‌, ఆలిండియా పార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరుపున విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీ తరుపున ఉలవల భరత్‌కుమార్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశా రు. మైదుకూరు అసెం బ్లీకి జైభారత్‌ నేషనల్‌ పార్టీ తరుపున లెక్కల శ్రీనివాసులరెడ్డి, ఇండిపెండెంట్‌గా సిద్ధంరెడ్డి శివశంకర్‌రెడ్డి నామినే షన్లు దాఖలు చేశారు.అన్నమయ్య జిల్లాలో రాయచోటి అసెంబ్లీకి వైసిపి అభ్యర్థి గడి కోట శ్రీకాంత్‌రెడ్డి తరుపున షేక్‌ ఫయాజ్‌బాషా, జై భరత్‌ నేషనల్‌ పార్టీ తరుపున జి.మదుసూదన్‌, ఇండిపెండెంట్‌గా మన్సూర్‌ అలీఖా న్‌, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎ.హరికృష్ణ నామినేషన్‌ దాఖలు చేశారు. రాజంపేట అసెంబ్లీకి ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ తరుపున కోటపాటి సుబ్బమ్మ, ఇండిపెండెంట్‌గా షేక్‌ సల్మాన్‌, వైసిపి తరుపున ఆకేపాటి అమరనాధరెడ్డి, రైల్వేకోడూరులో ఇండిపెండెంట్లుగా కాకి లకీëనరేష్‌, చెన్నూరు సుబ్బారావు, దామరాల సిద్ధయ్య, నగరిపాటి మహేశ్వర, దేవరపల్లి మురళీ, తిప్పన దుర్గయ్య, తుమ్మల సురేష్‌, బిఎస్‌పి తరు పున తాళ్లపాక సుబ్రమణ్యం, రెడ్డిపాక పెంచలయ్య, జనసేన పార్టీ తరుపున అరవ శ్రీధర్‌, వైసిపి తరుపున కొరముట్ల శ్రీనివాసులు, కాంగ్రెస్‌ తరుపున గోశాలదేవి, పీలేరులో ఇండిపెండెంట్‌గా ఆసాది వెంకటాద్రి, మదనపల్లి అసెంబ్లీకి ఇండిపెండెంట్లుగా ఎస్‌,జయసింహా, రాయదుర్గం జనార్ధన్‌, జై భారత్‌ నేషనల్‌ పార్టీ తరపున ఎం.భాస్కర్‌, తంబళ్లపల్లి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. బి.టెక్‌ రవిపై 12 కేసులు పులివెందుల టిడిపి అభ్యర్థి బి.టెక్‌ రవిపై 12 రకాల కేసులు నమోదు చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసు లన్నీ వివిద దశల్లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని పోరుమామిళ్ల, హైదరాబాద్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో డాక్యుమెంట్లతో కుట్రకు పాల్పడడం, క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించినట్లు కేసులు ఉన్నట్లు చూపించారు. చక్రాయపేట పిఎస్‌ పరిధిలో భూ వివాదంలో తలదూర్చడం, లింగాల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై అభ్యంతరాలు చెప్పడం, సింహాద్రిపురంలో చేతులతో కొట్టడం, బెదిరింపులకు పాల్పడడం, పులివెందుల ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌కు అనుమతి లేకుండా వెళ్లడం, డిప్యూటీ ఎస్పీ కార్యాలయం ఎదుట ప్రెస్‌ మీట్‌ నిర్వహించడం, పులివెందుల్లో కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడం, జమ్మలమడుగులో కేండిల్‌షో నిర్వహించడం ద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించడం వంటి కారణాలతో కూడిన కేసులు ఉన్న ట్లు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్‌ ఎదుట ముఖ్యమంత్రికి వ్యతిరే కంగా నినాదాలు చేయడం, వల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎయిర్‌ పోర్టు అధికారులతో వాగ్వాదం వంటి కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.చర ఆస్తుల విలువ రూ.11.97 కోట్లు పులివెందుల టిడిపి అభ్యర్థి బి.టెక్‌ రవి చేతిలో రూ.ఐదు లక్షలు, ఆయన సతీమని చేతిలో ఎనిమిది లక్షలు నగదు కలిగి ఉన్నారు. బ్యాంకు డిపాజిట్లు, ఎఫ్‌డిఆర్‌ డిపాజిట్స్‌, సేవింగ్స్‌, జ్యువెలరీ ఆయన చేతిలో రూ.50 గ్రాములు బంగారం, ఆయన సతీమణి 300 గ్రాముల బంగారు మొదలగు ఆస్తుల విలువ రూ. 11,97, 185, ఆయన సతీమణి పేరుతో రూ.30,98, 114 ఉన్నట్లు తెలి పారు. వీటితోపాటు కసనూరు, రావులకొలను గ్రామాల్లో ఆయన పేరిట రూ.40 కోట్లు, ఆయన సతీమణి పేరుతో రూ.82 కోట్లు ఉన్నట్లు చూపించారు. వివిద బ్యాంకులు, ఇతర సంస్థల్లో రూ.14 లక్షలు, ఆయన సతీమణి రూ.39 లక్షల అప్పు కలిగి ఉన్నట్లు తెలిపారు.నమోదైన కేసు లన్నీ వివిద దశల్లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని పోరుమామిళ్ల, హైదరాబాద్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో డాక్యుమెంట్లతో కుట్రకు పాల్పడడం, క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించినట్లు కేసులు ఉన్నట్లు చూపి ంచారు. చక్రాయపేట పిఎస్‌ పరిధిలో భూ వివాదంలో తల దూర్చడం, లింగాల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై అభ్యంతరాలు చెప్పడం, సింహా ద్రిపురంలో చేతులతో కొట్టడం, బెదిరింపులకు పాల్పడడం, పులివెందుల ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌కు అనుమతి లేకుండా వెళ్లడం, డిప్యూటీ ఎస్పీ కార్యాలయం ఎదుట ప్రెస్‌ మీట్‌ నిర్వ హించడం, పులివెందుల్లో కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడం, జమ్మలమడుగులో కేండిల్‌షో నిర్వహించడం ద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించడం వంటి కారణాలతో కూడిన కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్‌ ఎదుట ముఖ్యమంత్రికి వ్యతిరే కంగా నినాదాలు చేయడం, వల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎయిర్‌ పోర్టు అధికారులతో వాగ్వాదం వంటి కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.చర ఆస్తుల విలువ రూ.11.97 కోట్లు పులివెందుల టిడిపి అభ్యర్థి బి.టెక్‌ రవి చేతిలో రూ.ఐదు లక్షలు, ఆయన సతీమని చేతిలో ఎనిమిది లక్షలు న గదు కలిగి ఉన్నారు. బ్యాంకు డిపాజిట్లు, ఎఫ్‌డిఆర్‌ డిపా జిట్స్‌, సేవింగ్స్‌, జ్యువెలరీ ఆయన చేతిలో రూ.50 గ్రాములు బం గారం, ఆయన సతీమణి 300 గ్రాముల బంగారు మొ దలగు ఆస్తుల విలువ రూ. 11,97, 185, ఆయన సతీమణి పేరుతో రూ.30,98, 114 ఉన్నట్లు తెలి పారు. వీటితోపాటు కస నూరు, రావులకొలను గ్రామాల్లో ఆయన పేరిట రూ.40 కో ట్లు, ఆయన సతీమణి పేరుతో రూ.82 కోట్లు ఉన్నట్లు చూపి ంచారు. వివిద బ్యాంకులు, ఇతర సంస్థల్లో రూ.14 లక్షలు, ఆ యన సతీమణి రూ.39 లక్షల అప్పు కలిగి ఉన్నట్లు తెలిపారు.

➡️