మాధవి నామినేషన్‌కు తరలి రావాలి

పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి పిలుపు ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్రంలో ఈనెల 13న నిర్వహించే ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధిస్తుందని పోలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి పేర్కొ న్నారు. సోమవారం కడప నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి గ్రాఫ్‌ రోజు రోజుకూ పెరుగూత ఉందని చెప్పారు. 25న నామినేషన్లు ముగిసిన అనంతరం వైసిపి ఖాళీ అవుతుందని తెలిపారు. ఈనెల 24న ఉదయం 11.04 గంట లకు టిడిపి కడప నియోజకవర్గ అభ్యర్థి మాధవి నామినేషన్‌ దాఖలు చేస్తారని చెప్పారు. తమ నివాసం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, దీనిని నివారిం చుకునేందుకు రకరకాల ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సిఎం జగన్‌ కు పుల్ల గుచ్చుకుంటే చంద్రబాబుపై నిందలు వేశారని విమర్శించారు. షర్మిలకు అప్పు ఇచ్చినట్లు జగన్‌ డాక్యు మెంట్లు సష్టించడం దారుణమని చెప్పారు. ఈనెల 27, 28న ఎస్సీ, ఎస్టీ పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేయ నున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో అభివద్ధి శూన్యమని చెప్పారు. నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేసి ప్రజలను కరువు పరిస్థితుల్లోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వారానికి ఒక్కసారి మంచినీరు వస్తున్నాయని, ఈ దుస్థితికి కారణం సీఎం జగన్‌, డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా కారణమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్‌ అని విమర్శించారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బును వెదజల్లి ఓట్లు కొనుగోలు చేసేందుకు వైసిపి సిద్ధమైందని చెప్పారు. 20 సంవత్సరాలుగా టిడిపికి సీట్లు రావడం లేదని, ఈసారి మాధవికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన హామీలను పూర్తిచసేందుకు కత నిశ్చయంతో ఉన్నామని పేర్కొన్నారు. నామినేషన్‌ దాఖలకు టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టిడిపి నాయకులు గోవర్ధన్‌ రెడ్డి, శివ కొండారెడ్డి, తిరుమలేశు పాల్గొన్నారు.

➡️