గెలుపు చప్పుళ్ళు

May 26,2024 09:20 #kavithalu, #Sneha

కొన్నాళ్ళుగా నన్ను ఒక భూతం వెంటాడుతోంది..
అది నిజంగా భూతమే..
గట్టిగా అరిచి చెబుతున్నా..
ఎవరు నా మాట నమ్మరే..
భయపడకూడదు.. ఏది వచ్చినా ఎదుర్కోవాలి..
ఇవే మాటలు నాకు పదే పదే వినిపిస్తున్నాయి..
ఊహించని సంఘటన జరిగింది..
ఒక చెయ్యి నన్ను ఆహ్వానిస్తోంది..
నా చెయ్యి గట్టిగా పట్టుకుంది..
నేను గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నా..
నా మొఖంలో ఏదో కాంతి విడుదలవుతుంది..
పువ్వు వాడిపోతున్న నిట్టూర్పు..
నాకు వినిపిస్తూనే ఉంది..
ఆ తర్వాత..
రేకలన్నీ గాలిలో అటూ ఇటూ ఎగురుతున్నాయి..
ట్రాక్టర్ల పై కండువాలు ఎగరేస్తూ..
హర్షాతిరేకాలు హౌరు వినిపిస్తోంది..
అది దేశ రాజధానిలో అని నాకు చెబుతున్నారు..
అక్కడవే ఆ గెలుపు చప్పుళ్ళు అని…
ఒక పెద్ద నిట్టూర్పు విడిచాను..
హాయిగా నవ్వుకున్నా.. చాన్నాళ్ళ తర్వాత..

– శాంతిశ్రీ,
9866371283

➡️