వైసిపిలో పలువురు చేరిక

వైసిపిలో పలువురు చేరిక

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 53వ వార్డు పరిధి జాకీర్‌హుస్సేన్‌నగర్‌కు చెందిన పలువురు టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు 53వ వార్డు కార్పొరేటర్‌ బర్కత్‌ అలీ ఆధ్వర్యాన వైసిపిలో చేరారు. బిర్లా కూడలిలోని బొత్స స్క్వేర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వారికి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకె.రాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైసిపి విజయానికి కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజరుకుమార్‌, ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, రొంగలి జగన్నాథం, గుజ్జు వెంకటరెడ్డి, అమర్‌రెడ్డి, వల్లి, రామలక్ష్మి, షేక్‌ నభి తదితరులు పాల్గొన్నారు.పార్టీలో చేరిన వారితో కేకె రాజు

➡️