నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి

Dec 12,2023 22:07

కురుపాం : నాణ్యతతో కూడిన నిర్మాణ పనులను చేపట్టాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌ ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు. కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లోని టెకరికండి నుంచి భల్లుకోట వరకు, టి.కె.జమ్ము నుండి పల్లపుసిర్పి వరకు, పల్లపుసిరి నుండి నడిమి వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అలాగే కురుపాం మండలం జుంబ్రిరి నుండి కొత్తగూడ, నాయుడుగూడ గ్రామాల్లో బిటి రోడ్డు పనులను, భీంపురం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడుతూ నిర్మాణం జరుగుతున్న పనుల్లో నాణ్యతా లోపాల్లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️