మన్యంలో బాబు ష్యూరిటీ…

Mar 2,2024 21:45

 సీతంపేట : మండలంలోని సంతమల్లి, దారిమల్లి, మల్లి కాలనీ, నాయుడు మల్లి, కూసిమి గూడలో శంఖారావం కార్యక్రమంలో భాగంగా బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జయకృష్ణ స్థానిక మహిళలతో మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న వివిధ సమస్యల గురించి తెలుసుకున్నారు. త్వరలోనే మనందరి ప్రభుత్వం వస్తుందని, మన సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, సీనియర్‌ నాయకులు సీమల కృష్ణారావు, సీనియర్‌ నాయకులు నిమ్మక నాగేశ్వరావు, పాలక ఆదినారాయణ, కుంబిరిక రామారావు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ నిమ్మక చంద్రశేఖర్‌, ఉయిక సత్యం, బిడ్డిక స్వామినాయుడు, నిమ్మక మురళి, మూటక అప్పారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాలూరు రూరల్‌ : మండలంలోని కూర్మరాజుపేటలో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగం మరింత పెంచి పోషించిందని అన్నారు. యువత జీవితం బంగారు బాటలు వేయాలంటే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఓటుతో బుద్ది చెప్పాలని రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు ఆమదాల పరమేష్‌, పిన్నింటి ప్రసాద్‌ బాబు, శ్యామ్‌, బూస తవుడు, సర్పంచ్‌ నళిని, బాలాజీ, కృష్ణ, తిరుపతిరావు పాల్గొన్నారు.ఎమ్మెల్యేగా గెలిపించండి : జగదీశ్వరిగుమ్మలక్ష్మీపురం : టిడిపితోనే గిరిజన అభివృద్ధి సాధ్యమవుతుందని కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మారుమూల కొండలపైనున్న జర్మ పంచాయతీ బబ్బిడిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. గిరిజన యువతకు ఉపాధి కల్పన, గిరిజనుల హక్కులు, చట్టాలకు రక్షణ ఉండాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు హయాంలో గిరిజన గ్రామాలకు రోడ్లు, ప్రతి గ్రామానికి కొళాయిలు ఇచ్చే ఘనత చంద్రబాబుకే చెందుతుందన్నారు. 2024లో బాబు ముఖ్యమంత్రి గెలిచిన వెంటనే మండలంలో డోలీల బెడద ఉండదని, ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిస్తానని, వైసిపి ఎత్తివేసిన అనేక గిరిజన సంక్షేమ పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అందరూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి ని అత్యధిక మెజార్టీతో కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. బబ్బిడిలో 150 కుటుంబాలు వైసిపి నుంచి టిడిపిలోకి చేరాయి. నిజమైన స్వచ్ఛమైన గిరిజన అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించినందుకు సంఘీభావంగా కురుపాం నియోజకవర్గంలో టిడిపిని గెలిపించుకోవాలనే ధృఢ సంకల్పంతో ఆ పార్టీలోకి చేరామని వారు తెలిపారు. కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్‌ పాడి సుదర్శన్‌ రావు, ప్రధాన కార్యదర్శి పోలూరు శ్రీనివాసరావు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ కీలక దాసు, యూనిట్‌ ఇన్చార్జ్‌ అనిల్‌ కోటి సోమేశ్వరరావు, ఎక్స్‌ సర్పంచ్‌ ధర్మ తదితరులు ఉన్నారు.

➡️