సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె

Dec 20,2023 19:59

పార్వతీపురంటౌన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈనెల 26 నుంచి సమ్మెలోకి వెళ్తామని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సభ్యులు మున్సిపల్‌ కమిషనర్‌ జె. రామఅప్పలనాయుడుకు తెలిపారు. ఈ మేరకు గురువారం సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణతో కలిసి యూనియన్‌ నాయకులు కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను నాలుగేళ్లయినా నెరవేర్చిలేదని, వాటిని నెరవేర్చాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. సమ్మె నోటీసును అందజేసిన వారిలో మున్సిపల్‌ కార్మికులు చీపురుపల్లి, పడాల గాంధీ, నాగవంశం మల్లేష్‌, సింహాచలం ఉన్నారు.పాలకొండ: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 26నుంచి సమ్మెకు సిద్ధమవుతామని మున్సిపల్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సిహెచ్‌. సంజీవి కమీషనర్‌ సర్వేశ్వరరావు కు బుధవారం సమ్మె నోటీసు ఇచ్చారు. కార్యక్రమంలో కార్మికులు పి.వేణు, సురేష్‌, రామారావు, విమల తదితరులు ఉన్నారు.

➡️