ఇంటర్‌ ప్రవేశాలకు ఇంటింటికి కళాశాల సిబ్బంది

May 20,2024 21:12

కురుపాం : ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.ఉషారాణి తన సిబ్బందితో కలిసి సోమవారం కురుపాంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరమని కోరి అడ్మిషన్‌ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో కూడా అన్ని రకాల మౌలిక వసతులతో పాటు ల్యాబ్‌, నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. కావున ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మురళి, ఆకుల రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

➡️