వెదురుకుప్పంలో కేంద్ర బలగాలతో కవాతు

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : వెదురుకుప్పం మండలంలో కేంద్రబలగాలతో సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పచ్చికాపల్లం, వెదురుకుప్పం, దేవళంపేట గ్రామ ప్రధాన మార్గాలలో మంగళవారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ … రానున్న రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో … గ్రామ ప్రజలకు భద్రతతో కూడిన భరోసా కల్పిస్తామని అన్నారు. గ్రామ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లు తమను ఎవరైనా నాయకులు గాని కార్యకర్తలు గాని పార్టీ సానుభూతిపరులు కానీ బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అన్నారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. రానున్న రాష్ట్ర ఎన్నికలకు ఓటు వేయడం రాజ్యాంగ హక్కు అని, ఓటరు కార్డు కలిగిన ప్రతి ఒక్కరు స్వేచ్చగా హక్కులని వినియోగించుకోవాలని కోరారు.

➡️