గర్భిణుల్లో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలి

Jun 6,2024 21:50

ప్రజాశక్తి – కొమరాడ : మండలంలోని గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనత నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ ఎం.మల్లికార్జునరావు అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వైద్యులు, అంగన్వాడీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, ఎనీమియా సంబంధిత ఆరోగ్యం లోపం ఉన్న వారి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ మంచి వైద్య సేవలందించాలని సూచించారు. తప్పనిసరిగా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాల్లో సందర్శించి గ్రామంలో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్య స్థితి గతులను పరిశీలించి నివేదికలు అందజేయాలని తెలిపారు. ముఖ్యంగా అంగన్వాడీ పరిధిలో గల గర్భిణులు, బాలింతల వివరాలను ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మండలంలోని ఎట్టి పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతులు, చిన్నపిల్లలు రక్తహీనత లోపంతో మృతి చెందే అవకాశం లేకుండా వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. కాబట్టి గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య, అంగన్వాడీ సిబ్బంది గర్భిణీ, బాలింతల వివరాలు పూర్తిస్థాయిలో వారు ఆరోగ్య పరిస్థితిపై పరిశీలిస్తూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఆహారాన్ని గర్భిణీ, బాలింతలు పూర్తిస్థాయిలో వినియోగించుకొనేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ కొమరాడ ప్రాజెక్టు పిఒ సుగుణ, కొమరాడ పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, శిరీష, ఇఒపిఆర్‌డి రాధాకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సాలూరు: జిల్లాలో శిశు మరణాల రేటు తగ్గింపుపై సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సిఎం హెచ్‌ ఓ డాక్టర్‌ శివకుమార్‌ సూచించారు. గురువారం పట్టణం లో గుమడాం వైటిసిలో మామిడిపల్లి పిహెచ్‌సి, మెంటాడవీధి, తెలగావీధి యుపిహెచ్‌సిలకు చెందిన ఎఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నుంచి జిల్లాలో కేంద్ర వైద్యబృందం పర్యటించనున్న నేపథ్యంలో సిబ్బంది శిశు మరణాలకు సంబంధించిన వివరాలు, ప్రిజం 10లో భాగం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు,నీడ్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పి.వేణుగోపాల్‌ వున్నారు.పాచిపెంట : మండలంలో గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనత, శిశు మరణాలు తగ్గించేందుకు కలిసికట్టుగా చర్యలు చేపట్టేందుకు ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్‌, సచివాలయ సిబ్బందితో ఎంపిడిఒ పి.లక్ష్మీకాంత్‌ సమీక్షించారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రిజం-10 కార్యక్రమంలో భాగంగా మండలంలో గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనత, శిశు మరణాలు పదికి తగ్గించేందుకు పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఈనెల 8న కేంద్ర బృందం మండలానికి వస్తుందని తెలిపారు. సమావేశంలో ఐసిడిఎస్‌ సిడిపిఒ బి.అనంతలక్ష్మి, వైద్యాధికారులు వెంకటరమణ, సురేష్‌ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.గరుగుబిల్లి: మండలంలోని చినగుడబలో 104 వైద్య శిబిరం డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వంచారు. గర్భిణీల్లో రక్త హీనత, హైరిస్క్‌ ఉన్న వారు తనిఖీ చేయడం, అలాగే అన్ని రక్త పరీక్షలు చేసి గర్భిణులకు అందజేస్తున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన మందులు ఇస్తూ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పిహెచ్‌సిలో సాధారణ ప్రసవాలు జరిగేలా సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. రక్త హీనత, హైరిస్క్‌ సమస్యలకు గర్భిణీలు గురికాకుండా వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. అదే విధంగా ఈ శిబిరానికి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు ఈ వైద్య సేవలు వినియోగించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్‌ ఉదయకుమారి, మౌనిక, ఈశ్వరి, రమేష్‌. 104 సిబ్బంది దుర్గాప్రసాద్‌, శంకరావు, ఆశాలు పాల్గొన్నారు.ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కార్యాచరణ : డిఎంఒప్రజాశక్తి – సీతానగరంఆరోగ్య కార్యక్రమాల సమగ్ర నివేదికలను ఎప్పటికప్పుడు పునః పరిశీలన చేసుకొని ప్రజలకు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తకుండా తగు కార్యాచరణ చేయాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి. జగన్‌ మోహనరావు స్పష్టం చేశారు. స్థానిక పిహెచ్‌సిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల ఆరోగ్య సమస్యలు అందజేస్తున్న చికిత్స రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకొని స్పష్టమైన రోగ నిర్దారణ చేయాలని సూచించారు. దీర్ఘ కాలిక రోగులకు క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరిగేలా చూడాలన్నారు. జ్వర నిర్దారణ పరీక్షలు సకాలంలో జరపాలన్నారు. ల్యాబ్‌ రికార్డులు తనిఖీ చేసి రోజు వారీ చేపడుతున్న జ్వర పరీక్షల వివరాలు పరిశీలించారు. అనంతరం అత్యవసర చికిత్స అవసరమైన మందులు, వైద్య పరికరాలు పరిశీలించారు. ప్రధాని రహదారికి సమీపాన ఉన్న ఆసుపత్రి కావున ప్రాథమిక చికిత్స సిద్ధంగా ఉంచాలన్నారు. కుక్క,, పాము కాటుల చికిత్సకు అవసరమైన ఎఆర్‌ఒ, ఎఎస్‌వి మందుల లభ్యతను పరిశీలించారు. జాప్యం చేయక చికిత్సను వెంటనే అందజేయాలన్నారు. గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య పర్యవేక్షణకు సంబంచి ప్రిజమ్‌10 ప్రోగ్రాం పక్కగా నిర్వహించాలన్నారు. షిఫ్ట్‌ డ్యూటీ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలన్నారు. వైద్యాధికారి డాక్టర్‌ పావని,సిహెచ్‌ఓ ఎస్వీ రమణ, సూపర్వైజర్స్‌ సత్యవతి,భవాని,శర్మ ,వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

➡️