ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యాన వైద్య శిబిరం

ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యాన మందులు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-అనకాపల్లి :

ప్రజా ఆరోగ్య వేదిక నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ వైద్యులు సాంబ మూర్తి, మీనేంద్ర కుమార్‌ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో వారు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016 సంవత్సరం నుండి ప్రతి రెండు నెలలకు ఒకసారి, రెండవ ఆదివారం క్రమం తప్పకుండా కరోనా సమయంలో సైతం వైద్య శిబిరాలు నిర్వహించి, నేటికీ 45వ రెగ్యులర్‌ మెడికల్‌ క్యాంప్‌ జరుగుతుందని చెప్పారు. ఈ మెడికల్‌ క్యాంప్‌లో బిపి, షుగర్‌, ఫిట్స్‌, పక్షవాతం వ్యాధులకు మందులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ రెగ్యులర్‌ మెడికల్‌ క్యాంపు కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక సభ్యులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, రిటైర్డ్‌ ఉద్యోగస్తులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.

➡️