ఎంఎల్‌ఎ ‘ఇంటూరి’ దంపతులకు సన్మానం

Jun 20,2024 19:43
ఎంఎల్‌ఎ 'ఇంటూరి' దంపతులకు సన్మానం

ఎంఎల్‌ఎ ఇంటూరి దంపతులను సత్కరిస్తున్న దృశ్యం
ఎంఎల్‌ఎ ‘ఇంటూరి’ దంపతులకు సన్మానం
ప్రజాశక్తి-కందుకూరు కందుకూరు ఎంఎల్‌ఎగా ఇంటూరి నాగేశ్వరరావు ఘనవిజయం సాధించిన సందర్భంగా గురువారం కనిగిరి రోడ్డులోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులను టిడిపి నేతలు ఉన్నం వీరాస్వామి, నలబోతుల మురళి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తొలుత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎ నాగేశ్వరరావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అదే ఆవరణలోని వినాయకుడు, శివాలయం, అయ్యప్పస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత నేతలు, కార్యకర్తలు కలిసి స్వామివారికి 1,111 కొబ్బరికాయలు కొట్టారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు.కందుకూరు పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️