నైతిక విలువలే ప్రజాస్వామ్యానికి రక్ష : భీశెట్టి బాబ్జీ

Dec 9,2023 12:10 #Vizianagaram
moral values for democracy

ప్రజాశక్తి-విజయనగరం : నైతిక విలువలే ప్రజాస్వామ్యానికి రక్ష అని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ అన్నారు. అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో గురజాడ విద్యాసంస్థలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థ లను అవినీతి తినేస్తుందని, రాజ్యాంగం ఎంత బాగున్నా అది అమలు చేసే వారు చెడ్డవారైతే ఫలితాలు చెడుగా, చేదుగా ఉంటాయని అన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గురుప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలో ఏ మూల చూసినా అవినీతి పరంపరే అని, ఈ వ్యవస్థను మార్చాలంటే దాని మూలాలు నుండి మార్పు తీసుకురావాలని విలువలతో కూడిన వ్యవస్థ ఆవిర్భవించాలని అన్నారు. జవాబుదారీతనంతోనే అవినీతిని అంతం చేయవచ్చని, అవినీతి భూతం అభివృద్ధికి శరాఘాతంగా పరిణమించిందని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు`నైతిక విలువలు అనే అంశంపై నిర్వహించిన వక్త ృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన జి షర్మిల, కె లక్ష్మీ శ్రావణి,జి.కౌశల్యకు బహుమతులు, పతకాలు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పూడి శేఖర్‌, ఎ ఎన్‌ నాయుడు, లత తదితరులు పాల్గొన్నారు.

➡️