మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు

మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు సికింద్రాబాద్‌ – విశాఖపట్నం – సికింద్రాబాద్‌, కెఎస్‌ఆర్‌ బెంగళూరు – రూర్కెలా – ఎస్‌ఎంవిటి బెంగళూరు, ఎస్‌ఎంవిటి బెంగళూరు -ఖరగ్‌పూర్‌ – ఎస్‌ఎంవిటి బెంగళూరు, ఎస్‌ఎంవిటి బెంగళూరు – ఖుర్దా రోడ్‌ – ఎస్‌ఎంవిటి బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు 07097 సికింద్రాబాద్‌ – విశాఖపట్నం వేసవి ప్రత్యేక రైలు మే 12 ఆదివారం రాత్రి 19.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. 07098 విశాఖపట్నం – సికింద్రాబాద్‌ వేసవి ప్రత్యేక రైలు 13న సోమవారం రాత్రి 19.50 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేటి మరుసటి రోజు ఉదయం 8:15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయి 06249 కెఎస్‌ఆర్‌ బెంగళూరు-రూర్కెలా వేసవి ప్రత్యేక రైలు మే 17 శుక్రవారం రాత్రి 21.15 గంటలకు కెఎస్‌ఆర్‌ బెంగళూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 16.08 గంటలకు దువ్వాడ చేరుకొని మరలా 16.10 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 05.00 గంటలకు రూర్కెలా చేరుకుంటుంది. 06250 రూర్కెలా – ఎస్‌ఎంవిటి బెంగళూరు వేసవి ప్రత్యేక రైలు మే 19 ఆదివారం ఉదయం 07.00 గంటలకు రూర్కెలా నుండి బయలుదేరి అదేరోజు రాత్రి 19.18 గంటలకు దువ్వాడ చేరుకొని మరలా 19.20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 14:00 గంటలకు ఎస్‌ఎంవిటి బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైళ్లు కృష్ణరాజపురం, బంగారుపేట, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, రాయగడ, తిట్లాగఢ్‌, బర్దస్‌పూర్‌, బర్దాస్‌ రోడ్‌, బలాంఘర్‌, బలంగ్‌హర్‌ రోడ్‌ మీదుగా ప్రయాణిస్తాయి.06259 ఎస్‌ఎంవిటి బెంగళూరు – ఖరగ్‌పూర్‌ వేసవి ప్రత్యేక రైలు మే 25 శనివారం ఉదయం 10.15 గంటలకు ఎస్‌ఎంవిటి బెంగళూరు నుండి బయలుదేరి మరుసటి రోజు ఆదివారం ఉదయం 05.28 గంటలకు దువ్వాడకు చేరుకొని మరలా 05.30 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 19.30 గంటలకు ఖరగ్‌పూర్‌ చేరుకుంటుంది. 06260 ఖరగ్‌పూర్‌ – ఎస్‌ఎంవిటి బెంగళూరు వేసవి ప్రత్యేక రైలు మే 26 ఆదివారం రాత్రి 22.15 గంటలకు ఖరగ్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.00 గంటలకు దువ్వాడ చేరుకొని మరలా 11.02 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మంగళవారం ఉదయం 8.00 గంటలకు ఎస్‌ఎంవిటి బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైళ్లు వైట్‌ఫీల్డ్‌, జోలార్‌పేట్‌, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బ్రహ్మపూర్‌, ఖుర్దా రోడ్‌, భువనగిరి, కటక్‌, భద్రక్‌, బాలసూరు మీదుగా ప్రయాణిస్తాయి. 06251 ఎస్‌ఎంవిటి బెంగళూరు – ఖుర్దా రోడ్‌ వేసవి ప్రత్యేక రైలు మే 18 శనివారం ఉదయం 10.15 గంటలకు ఎస్‌ఎంవిటి బెంగళూరు నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.28 గంటలకు దువ్వాడ చేరుకుని మరలా 05.30 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 21.00 గంటలకు ఖుర్దా రోడ్డుకు చేరుకుంటుంది. 06252 ఖుర్దా రోడ్‌ – ఎస్‌ఎంవిటి బెంగళూరు వేసవి ప్రత్యేక రైలు మే 19 ఆదివారం రాత్రి 22.30 గంటలకు ఖుర్దా రోడ్‌లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 15.13 గంటలకు దువ్వాడ చేరుకొని మరలా 15.15 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 10:55 గంటలకు ఎస్‌ఎంవిటి బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైళ్లు వైట్‌ఫీల్డ్‌, జోలార్‌పేట్‌, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగంగగూడ, సంబల్పూర్‌, రైరాఖోల్‌, అనుగుల్‌, ధెంకనల్‌, కటక్‌, భువనేశ్వర్‌ మీదుగా ప్రయాణిస్తాయి.

➡️