జీతాల కోసం మున్సిపల్‌ కార్మికులు ధర్నా

May 24,2024 00:08

కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో కార్మికులు, నాయకులు
ప్రజాశక్తి – మంగళగిరి :
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పెండింగ్‌ జీతాలను చెల్లించాలని, సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. క్లాప్‌ ఆటో డ్రైవర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమస్యలపై పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని సిఐటియు నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. అనంతరం అసిస్టెంట్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో సిఐటియు నాయకులు వై.కమలాకర్‌, యూనియన్‌ నాయకులు సిహెచ్‌ శివపార్వతి, ఎం.నరసింహారావు, సి.స్వామి, వి.అరుణ, ఎం.తిరుపతమ్మ, పి.వెంకటేశ్వర్లు, వై.దుర్గారావు పాల్గొన్నారు.

➡️