ఆట పాటలతో నిరసన

Dec 31,2023 21:30

రుద్రవరంలో కోలన్నలు ఆడుతూ అంగన్వాడీల నిరసన

ఆట పాటలతో నిరసన
– కబడ్డీ, ఖోఖో, కుర్చీలాట, పాటల ద్వారా నిరసన
– నంద్యాలలో సిఎం, మంత్రుల ప్లకార్డులను మెడలో వేసుకుని..
– 20వ రోజు కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె
ప్రజాశక్తి – విలేకరులు

నంద్యాల జిల్లాలో 20వ రోజు అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. నంద్యాలలో సిఎం, మంత్రుల ప్లకార్డులు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. బేతంచెర్ల, ఆత్మకూరు, నందికొట్కూరు, రుద్రవరం, చాగలమర్రి, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్‌, పాణ్యం తహశీల్దార్‌ కార్యాలయాలు ఎదుట దీక్షా శిబిరాల వద్ద అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు ఆట పాటల ద్వారా నిరసన చేపట్టారు. కుర్చీల ఆట, కబడ్డీ, ఖోఖో తదితర ఆటలు ఆడారు. ఆత్మకూరులో బసవన్నకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. పాములపాడులో అంగన్వాడీలకు ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్‌ మద్దతుగా పాల్గొని మాట్లాడారు. నంద్యాల కలెక్టరేట్‌ : అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని గత 20 రోజుల నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ చేపట్టినప్పటికీ సరైన ఫలితాలు లేవు. లబ్ధిదారులకు రేషన్‌ను, పాలు, గుడ్లు వంటి పోషకారాన్ని సక్రమంగా అందించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సమ్మె పట్ల ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో అంగన్‌వాడీలు ఆందోళనలను రోజురోజుకు ఉధృతం చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీలు సిఎం, మంత్రుల ప్లకార్డులను మెడలో వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలు సమ్మెతో గర్భిణులకు సరైన పోషకాహారం అందడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పాములపాడు : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించమంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమ్మెను విచ్చిన్నం చేసేందుకు బెదిరింపులకు పూనుకుంటున్నారని, అలాంటి బెదిరింపులకు భయపడేది లేదని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రాజశేఖర్‌ పేర్కొన్నారు. ఆదివారం పాములపాడులో అంగన్వాడీలు కబడ్డీ, ఖోఖో ఆటలు ఆడి నిరసన తెలిపారు. ఈ సమ్మెకు ఎ.రాజశేఖర్‌ మద్దతు తెలిపి మాట్లాడారు. రైతు సంఘం జిల్లా నాయకులు ఈరన్న, నాయకులు సామన్న, వెంకటేశ్వరరావు, రంగస్వామి, అంగన్వాడీ నాయకురాలు శివలక్ష్మి, నాగమద్దమ్మ, నాగమణి, రమణ బారు, శ్రీలత, టీచర్లు పాల్గొన్నారు. ఆత్మకూరు : పట్టణంలోని తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు అట పాట ద్వారా నిరసన తెలియజేశారు. అనంతరం బసవన్నకు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ కార్యదర్శి మంజుల, నాయకురాలు లక్ష్మీదేవి, ప్రమీలమ్మ, సిఐటియు పట్టణ అధ్యక్షులు రజాక్‌, కార్యదర్శి రామ్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు రణధీర్‌, అంగన్వాడి నాయకురాలు సుధారాణి, వెంకటలక్ష్మి, లక్ష్మి, ప్రియాంక, ప్రమీల, రవణమ్మ, అరుణ, విజయలక్ష్మి, లక్ష్మీదేవి, చెన్నమ్మ, సుజాత, సిఐటియు నాయకులు సురేంద్ర, గణపతి పాల్గొన్నారు. కొత్తపల్లి : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు అట పాటల ద్వారా నిరసన తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు ఇ.హరిత, మండల నాయకురాలు రమణమ్మ, శ్రీదేవి, లైసమ్మ, శ్రావణి, మరియమ్మ, నాగమణి, అంకమ్మ, సుభాషిని, వసంత లక్ష్మి, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. మిడుతూరు : మిడ్తూర్‌లో నిరవధిక సమ్మె దీక్షా శిబిరం వద్ద అంగన్‌వాడీలు కబడ్డీ, ఆటపాటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శు డి.సుబ్బమ్మ, జి.లక్ష్మి కుమారి, వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి పక్కిరి సాహెబ్‌, జిల్లా నాయకులు టి.ఓబులేసు, సిఐటియు జిల్లా నాయకురాలు జి.నాగమణి, మండల నాయకులు వెంకటశివుడు, అంగన్వాడీ నాయకులు జయమ్మ, రాధిక, రమాదేవి, నారాయణమ్మ, భువనేశ్వరి, ఉమాదేవి, శైలజ, సైదాబీ, హరిప్రియ, లక్ష్మీదేవి పాల్గొన్నారు. పగిడ్యాల : పగిడ్యాలలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెను కొనసాగించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి, అంగన్వాడి కార్యకర్తలు వరలక్ష్మి, పద్మావతమ్మ, ప్రభావతి, నాగమణి, పద్మావతి, హైమావతి తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు టౌన్‌ : పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఆటపాటలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్‌ రెడ్డి, వ్యకాసం జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు, అంగన్వాడి నాయకురాలు మదార్‌ బి, శైలజ, వెంకట లక్ష్మమ్మ, లలిత, లక్ష్మీ, నాగరత్నమ్మ, అరుణ కుమారి, అక్కమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. బండి ఆత్మకూర్‌ : మండలం లోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్‌ సిఐటియు మండల కార్యదర్శి రత్నమయ్య, వ్యకాసం నాయకులు డేవిడ్‌ల ఆధ్వర్యంలో ఆటపాటలతో నిరసన తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. కొలిమిగుండ్ల : ఆడుదాం-ఆంద్ర క్రీడల్లో నిమగమైన ప్రభుత్వానికి అంగన్వాడీలు కబడ్డీ ఆడుతూ తమ డిమాండ్లను కూత ద్వారా వినిపించి విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కొలిమిగుండ్ల ఎమ్మార్వో కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు, సిఐటియు జిల్లా నాయకుడు పి దావీదు, అంగన్వాడి వర్కర్స్‌ భాగ్యలక్ష్మి, శ్రీదేవి, రేణుక, సరిత, శ్రీలక్ష్మి, లక్ష్మి, సుజని, సుహాసిని, జ్యోతి, రామలక్ష్మి, రంగమ్మ పాల్గొన్నారు. బనగానపల్లె : పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు కుర్చీలాట ఆడి నిరసనను వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎల్లయ్య, డివిజన్‌ కార్యదర్శి సుబ్బయ్య, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి రోజారమణి, అంగన్వాడి వర్కర్లు రమాదేవి, వరలక్ష్మి, మల్లేశ్వరి, మహేశ్వరి, శశికళ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. బేతంచెర్ల : అంగన్వాడీలు స్థానిక సిఐటియు కార్యాలయం ఆవరణంలో మ్యూజికల్‌ చైర్‌ ఆట ఆడుతూ, పాటలు పాడుతూ అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌కె.నాగలక్ష్మి, గుల్జార్బి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షురాలు జి.షేభారాణి మాట్లాడారు. అంగన్వాడీలు అంజలి, సరోజ, ఎల్లమ్మ, రమణమ్మ, అనూష, జ్యోతి, భూలక్ష్మి, సరళ, మహాలక్ష్మి సరస్వతి, రాధాదేవి, రమాదేవి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. మహానంది : శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి అంగన్వాడీలు డిమాండ్స్‌తో కూడిన వినతి పత్రం మహానంది క్షేత్రంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడిల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. డోన్‌ : సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా 20వ రోజు ఆదివారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం దగ్గర అంగన్వాడీలు క్రికెట్‌ ఆడి నిరసన వ్యక్తం చేశారు.ఈనెల 3న నిర్వహించే నంద్యాల కలెక్టరేట్‌ ముట్టడికి అంగన్‌వాడీలు తరలిరావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మాణిక్యం శెట్టి, సిఐటియు జిల్లా కార్యదర్శి టి.శివరాం,మండల అధ్యక్షులు పి.రామాంజనేయులు, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాళ్లు సులోచన, రహమద్బి, సుమలత మాట్లాడారు.

➡️