ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించాలి

Dec 23,2023 21:24

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ

ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించాలి
– జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ
ప్రజాశక్తి – రుద్రవరం
హెల్త్‌కు సంబంధించిన వివిధ రకాల ఆరోగ్య కార్యక్రమాలను సరైన సమయంలో నిర్వహించాలని జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. శనివారం మండలంలోని ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన కొత్త భవనాలను పరిశీలించారు. అనంతరం ముకుందాపురంలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో ఎల్‌సిడిసి, జాతీయ ఆరోగ్య సర్వే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు నవీన్‌ కుమార్‌, గాయత్రి, హెల్త్‌ సూపర్వైజర్‌ బాలస్వామి, సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు .

➡️