కంప్యూటర్ పట్ల పరిజ్ఞానం పెంపొందించుకోవాలి

Jan 31,2024 16:48

విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ పై అవగాహన కల్పిస్తున్న ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటసుబ్బారెడ్డి

కంప్యూటర్ పట్ల పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
ప్రజాశక్తి-డోన్
విద్యార్థులు కంప్యూటర్ పట్ల పరిజ్ఞానం పెంపొందించుకోవాలని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటసుబ్బారెడ్డి అన్నారు.కంప్యూటర్ శిక్షణ కోసం బుధవారం విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. డోన్ పట్టణం పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకట సుబ్బారెడ్డి ఆద్వర్యంలో 9,10 వ తరగతి విద్యార్థులకు వొకేషనల్ ట్రైనర్ అల్లిపీరా,మహేష్ ఆధ్వర్యంలో డోన్ పట్టణం లోని కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కు తీసుకెళ్లి విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వొకేషనల్ కోర్సు చదివించడం వల్ల,వారు టెక్నికల్ గా అభివృద్ధి చెంది,జీవితం లో రాణించాలని కోరారు.కంప్యూటర్ కోర్సులు సి,సి ప్లస్,జావా లాంటి కోర్సులతో పాటు మైక్రోసాఫ్ట్ వర్డ్,విండోస్,ఎక్సెల్,టైపింగ్ పై పట్టు సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి,వెంకట రమణ, శ్రీనివాసులు,ప్రసాద్ రావు,కంప్యూటర్ ప్యాకల్టీ కిరణ్,యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️