కదం తొక్కిన అంగన్వాడీలు

Jan 3,2024 16:29

కలెక్టరేట్కు కదం తొక్కిన అంగన్వాడీలు

కదం తొక్కిన అంగన్వాడీలు
నంద్యాల పట్టణంలో భారీ ర్యాలీ… కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా..
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం…
ప్రభుత్వం, అధికారుల బెదిరింపులకు బెదిరేది లేదు…
పలు ప్రజా సంఘాలు సంఘీభావం
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పదవి విరమణ పొందిన తర్వాత 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఫేస్ యాప్ లను ఎత్తివేయాలని, అంగన్వాడీ ల నిర్వహణకు మెస్ చార్జీలు పెంచాలని,అంగన్వాడీ లకు గ్రాడ్యూటీ పెంచాలని సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తదితర డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కలెక్టరేట్ కు కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ లు జిల్లా కేంద్రం కు తరలి వచ్చారు. సీఐటీయూ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ లు చేపట్టిన ఆందోళనతో ట్రాఫిక్ స్థంభించింది. స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అటు వైపు వెళుతుండగా ఆయన కాన్వాయిని అంగన్వాడీ లు అడ్డుకున్నారు. పోలీసులు,సీఐటీయూ నాయకులు వచ్చి సర్ది చెప్పడం తో ఎమ్మెల్యే వాహనాన్ని వదిలిపెట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ లు కలెక్టరేట్ వద్ద రోడ్డు పైన బైటాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు వాహనాలను దారి మల్లించారు.అనంతరం జరిగిన కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అంగన్వాడీ ల సమస్యల పట్ల నిమ్మకు నిరీక్కినట్లు వ్యవహారిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు 23 రోజులుగా సమ్మె చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించక పోగా సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగల గొట్టించి సమస్యను మరింత జటిలం చేస్తున్నారని పేర్కొన్నారు. అనేక ఏళ్ల నుండి చాలీ చాలని జీతాలతో జీవితాలు గడుపుతున్నారన్నారు.అంగన్వాడీ ల జీతాలు పెంచడానికి 300 కోట్లు నీ దగ్గర లేవా నీ గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి 450 కోట్లు ఖర్చు పెడుతున్నావ్ ఆ నిధులు ఎక్కడివి…మేము కట్టే పన్నులు నుడి వచ్చేవి కావావా అంటూ వారు ప్రశ్నించారు. సచివాలయం ఉద్యోగులతో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తానన్నవ్… సాధ్యం అయిందా.ఫెయిల్ అయ్యావు జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పటికైనా అంగన్వాడీ ల సమస్యలు పరిష్కరించి గర్భణీ లు, బాలింతలకు పిల్లలకు సక్రమంగా అంగన్వాడీ సేవలు అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేభారాణి,నిర్మలమ్మలు మాట్లాడుతూ మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.62 ఏళ్లు కు పెంచమని అంగన్వాడీ లు అడగలేదని కనీస వేతనం 26 వేల రూపాయలు పెంచాలని కోరుతున్నామన్నారు.తాము 23 రోజులుగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు టి. మద్దులు, జిల్లా నాయకులు రత్నమయ్య, భాస్కర్, ఎల్లయ్య,వి. బాల వెంకట్,పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు డి. లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి. నిర్మల తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమం లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు నాగరాణి,డి .నిర్మలమ్మ ,వెంకటలక్ష్మి ప్రాజెక్ట్ కార్యదర్శి బి . సునీత, నంద్యాల ప్రాజెక్టు అధ్యక్షురాలు రమణమ్మ, సెక్టార్ లీడర్స్ ప్రసన్న, సరస్వతి, నీలిమ లలితమ్మ, సునీత , వరలక్ష్మి, సారమ్మ సావిత్రీ, అరుణ, రత్నమ్మ జిల్లా నలుమూలల నుండి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️