కోలాటంతో వినూత్నంగా అంగన్వాడీల నిరసన

Jan 2,2024 16:33

 

మహానందిలో అంగన్వాడిలు కోలాటంతో నిరసన

22 రోజులుగా సమ్మె చేస్తున్న చలించని ప్రభుత్వం

కోలాటంతో వినూత్నంగా అంగన్వాడీల నిరసన
ప్రజాశక్తి – మహానంది
22 రోజులుగా అంగన్వాడిలు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చలించడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం మహానందిలోని తహసిల్దార్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు కోలాటంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పట్టించుకోవాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఇన్ని రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. 22 రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలు చేస్తున్నా, మహిళలు అని కనీసం ఆలోచించకుండా మొద్దు నిద్రతో నటిస్తున్న ప్రస్తుత జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి త్వరలోనే అంగన్వాడీలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని, తమ న్యాయమైన కోరికలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సావిత్రి, నారాయణమ్మ, జ్యోతి ఉషారాణి, గౌరీ, చండీ దేవి, మహేశ్వరి, పుష్పకళ, లక్ష్మి, ఖైరున్‌ , కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️