బహిరంగ సభకు తరలిన పగిడ్యాల టిడిపి నేతలు

Jan 9,2024 20:00

టిడిపి బహిరంగ సభకు తరలి వెళ్లిన టిడిపి నాయకులు

బహిరంగ సభకు తరలిన పగిడ్యాల టిడిపి నేతలు

ప్రజాశక్తి – పగిడ్యాల

టిడిపి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలో నిర్వహిస్తున్న ‘రా కదలిరా’ బహిరంగ సభకు పగిడ్యాల మండలం నుంచి టిడిపి నాయకులు మంగళవారం తరలి వెళ్లారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తుండడంతో పగిడ్యాల మండలం నుంచి టిడిపి నాయకులు తరలి వెళ్లారు. టిడిపి నాయకులు పుల్యాల శ్రీనివాసరెడ్డి (వాసు రెడ్డి), పుల్యాల రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పగిడ్యాల గ్రామం నుంచి, లక్ష్మాపురం గ్రామం నుంచి టిడిపి నాయకులు మద్దిలేటి గౌడ్‌, షమీన్‌, కుమ్మరి గోవిందు ఆధ్వర్యంలో రా కదలిరా బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️