భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం

Mar 23,2024 20:51

భగత్‌ సింగ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న నాయకులు

భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం
– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు
ప్రజాశక్తి – నంద్యాల
భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై యువత ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు పేర్కొన్నారు. భగత్‌ సింగ్‌ 93వ వర్థంతి సందర్భంగా శనివారం నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్‌ లారీ హమాలీ యూనియన్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించి ప్రజలపై ఉపయోగిస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో బాంబు వేసిన ధీరోదాత్తుడు భగత్‌ సింగ్‌ అన్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వం చేస్తున్న చట్టాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఉరిశిక్ష పడుతుందని తెలిసినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగి ప్రాణాలర్పించిన గొప్ప వీరుడని తెలిపారు. భగత్‌ సింగ్‌ పోరాటం నేటి యువకులకు, విద్యార్థులకు స్పూర్తిదాయకమన్నారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తున్న బిజెపి మతం ముసుగులో మళ్ళీ అధికారం చేపట్టాలని మతవిద్వేషాలకు పాల్పడుతూ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి దుర్మార్గాలను ప్రజలు గమనించాలని కోరారు. బిజెపికి మద్దతు పలుకుతున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు రాష్ట్రంలో బుద్ధి చెప్పాలని, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడే లౌకిక పార్టీలను గెలిపించుకోవాలని, దీనికోసం అహర్నిశలు కృషి చేయాలని, ప్రజలంతా ఐకమత్యం కావాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్‌, హమాలీ యూనియన్‌ కార్యదర్శి వెంకట లింగం, నాయకులు జైలాన్‌, నరసింహ, హమాలీలు పాల్గొన్నారు.భగత్‌ సింగ్‌ లైబ్రరీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో : భగత్‌ సింగ్‌ లైబ్రరీలో భగత్‌ సింగ్‌ 93వ వర్ధంతి ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ బి.శంకరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా జాతీయ జెండా ఎగురవేసి, భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ.నాగరాజు హాజరై మాట్లాడారు. భారత స్వాత్రంత్ర ఉద్యమంలో భగత్‌ సింగ్‌ త్యాగం మరువలేనిదని అన్నారు. ట్రస్ట్‌ చైర్మన్‌ బి. శంకరయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలను కులం, మతం ప్రాతిపదికన విడదీసి మతోన్మాద ధోరణి పెంచిందన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు తోట మద్దులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు మోడీ విధానాల పట్ల అవగాహన కలిగి మోసపూరిత మాటలకు లొంగకుండా తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సందర్బంగా ప్రజాకళాకారులు చిన్న బాలహుస్సేని, వీరసేన, రమణ బృందం భగత్‌ సింగ్‌ త్యాగనిరతిని కొనియాడుతూ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ రామకృష్ణ రెడ్డి, లాయర్‌ శ్రీనివాసులు, మాదాల శ్రీనివాసులు,నాయకులు గండు మాధవరావు, రిటైర్డ్‌ ఎస్‌ఐ సుబ్బయ్య, తోట పార్థుడు, భాస్కర్‌, లెక్చరర్‌ కష్ణ మూర్తి రాజు, రామరాజు, ఎల్‌ఐసి రామచంద్ర మూర్తి, రెడ్‌క్రాస్‌ నాయకులు దస్తగిరి, రచయిత ముర్తుజా తదితరులు పాల్గొన్నారు. పాణ్యం : పాణ్యంలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌, సుకుదేవ్‌, రాజ్‌గురుల చిత్ర పటాలకి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సిఐటియు మండల కార్యదర్శి కె భాస్కర్‌. ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు బత్తిని ప్రతాప్‌, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పార్థసారథి రెడ్డి, బాబు, బాషా, నాగరాజు, హమాలీ వర్కర్స్‌ పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : నేటి యువత స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలని ఆపుష్మ నంద్యాల డివిజన్‌ అధ్యక్షులు అమీర్‌ భాష అన్నారు. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని కెవి సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో కళాశాల డైరెక్టర్‌ భూమా శ్రీనివాస్‌ రెడ్డి, అపుస్మ ఆళ్లగడ్డ యూనిట్‌ కార్యదర్శి ఓబన్న ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్‌ తెలుగు పండిట్‌ రాధాకష్ణ, కానాల విశ్వనాథ్‌, కళాశాల లెక్చరర్‌ బషీర్‌, విద్యార్థులతో కలిసి భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

➡️