మల్లన్న సన్నిధిలో నారా లోకేష్‌ దంపతులు

Feb 1,2024 21:16

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నారా లోకేష్‌ , బ్రాహ్మణి, దేవాంశ్‌, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర్‌రెడ్డి దంపతులు

మల్లన్న సన్నిధిలో నారా లోకేష్‌ దంపతులు
– హెలిప్యాడ్‌ వద్ద టిడిపి, జనసేన నాయకులు ఘన స్వాగతం
ప్రజాశక్తి – శ్రీశైలం/శ్రీశైలం ప్రాజెక్టు
శ్రీశైలం దేవస్థానంలోని స్వామి అమ్మవార్లను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. నారా లోకేష్‌, ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌లు శ్రీశైల మల్లన్నను దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. ముందుగా వీరు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే దేవస్థానం అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేద పండితులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా మల్లికార్జున స్వామిని, ఆ తర్వాత భ్రమరాంబ దేవిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచనం మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. శేష వస్త్రాలను, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. వీరితోపాటు టిడిపి శ్రీశైలం నియోజకవర్గం ఇన్చార్జి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి దంపతులు ఉన్నారు. అంతకుముందు సుండిపెంట హెలిప్యాడ్‌లో టిడిపి శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు పార్టీ శ్రేణులతో పాటు జనసేన శ్రీశైల మండల నాయకులు కొట్టే సురేంద్ర ప్రసాద్‌, వెంకట్‌, నాగసాయి, సాయిల నేతృత్వంలో కార్యకర్తలు ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎన్నికల్లో విజయానికి ఉమ్మడిగా కలిసి కృషి చేస్తామన్నారు. ఇదే క్రమంలో టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతామని హామీ ఇచ్చారు. స్వాగతం పలికిన వారిలో టిడిపి నేతలు ఎన్‌ఎండి ఫరూక్‌, భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా జగత్‌ విఖ్యత్‌ రెడ్డి, గౌరువెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి, ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి, ఎవి.సుబ్బారెడ్డి, టిడిపి నాయకులు మైలా శ్రీను, సురేష్‌, రూపస్‌, మీనిగ శ్రీను పాల్గొన్నారు. శ్రీశైలానికి వచ్చిన టిడిపి నంద్యాల జిల్లా నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో నారాలోకేష్‌ కొద్దిసేపు మాట్లాడారు. పార్టీని గెలిపించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఆయన వారికి పలు సలహాలు, సూచనలు చేశారు.నారా లోకేష్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే బిసిబనగానపల్లె : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి కలిసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. జిల్లా రాజకీయాలపై నారా లోకేష్‌తో మాజీ ఎమ్మెల్యే బిసి చర్చించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శింంచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

➡️