మున్సిపల్ కార్మికులకు పిఎఫ్ చెల్లించాలి – సిఐటియు

Dec 27,2023 17:52
ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు దీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు
మున్సిపల్ కార్మికులకు పిఎఫ్ చెల్లించాలి – సిఐటియు
ప్రజాశక్తి – ఆత్మకూర్
ఆత్మకూరు మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న పిఎఫ్ ను చెల్లించాలని  సిఐటియు పట్టణ కార్యదర్శి  రామ్ నాయక్, ఉపాధ్యక్షులు రణధీర్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు నాగన్న, గొడుగురాజు, జోసెఫ్ లు అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర 2వ రోజు నిరవదిక సమ్మె చేపట్టడం  జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ప్రజలందరికీ రోగాలు, వ్యాధులు సంభవించకుండా ప్రతిరోజు పట్టణాన్ని శుభ్రం చేస్తూ, కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులు ప్రజలందరికీ కరోన సంభవించకుండా విధులు నిర్వహించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీ లోను, బయట పాదయాత్రలోను మున్సిపల్ కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరిని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలలో పర్మెంటు చేస్తానని, సమాన పనికి సమాన వేతం చెల్లిస్తామని, పర్మినెంట్ సిబ్బందికి సిపిఎస్ ను వారం రోజుల్లోనే రద్దు చేస్తామని హామీలు ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కార్మికులు తిమయ్య, నాగన్న, మోహన్, సురేష్, దానమయ్య, రవి, రూతమ్మ, జీవరత్నమ్మ, మణెమ్మ, సుగుణమ్మ, కుమారి, సుశీలమ్మ,  తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల సమ్మెకు కేవీపీఎస్ మద్దతు…
మున్సిపల్ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేసినట్లు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రామదాసు తెలిపారు.
➡️