మోహన్‌రావుకు జాతీయస్థాయి అవార్డు

Apr 20,2024 20:47

 ప్రజాశక్తి-బొబ్బిలి : పాత బొబ్బిలికి చెందిన ఉపాధ్యాయులు మింది విజయ మోహన్‌రావుకు జాతీయ స్థాయి ఇండియన్‌ ఐకాన్‌ అవార్డు లభించింది. ఆంగ్ల భాషలో పదేళ్లుగా విద్యార్థులకు సులభమైన పద్ధతుల ద్వారా ఆయన బోధన కృత్యాలు నిర్వహిస్తూ వారిలో ఆంగ్ల భాష పట్ల ఆసక్తిని పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం హిందుస్థాన్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా మీడియా విభాగం కైట్స్‌క్రాఫ్ట్‌ సంస్థ ఆన్‌లైన్‌లో ‘విద్యార్ధుల విద్యాభివృద్ధి’ అంశంపై నిర్వహించిన పోటీల్లో మోహన్‌రావును ఎంపిక చేశారు. మోహనరావుకు అవార్డు లభించడం పట్ల డెల్టా, యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌, రచనా సమాఖ్య, మనం బ్లడ్‌ డొనేషన్‌ క్లబ్‌, మనం పాత బొబ్బిలి, బొబ్బిలి ఫిల్మ్‌ సొసైటీ, గాంధీ స్మారక నిధి, దయ గల గోడ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

➡️