ప్రసాదరాజుకి కరచాలనం చేసిన నాయకర్‌

Apr 19,2024 12:15 #Nayakar, #Nominations, #Wishes

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : నరసాపురం రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం జరిగింది. వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్‌ రాజు నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళుతుండగా మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌ ఎదురుపడ్డారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపడుతున్న నాయకర్‌… అటుగా నరసాపురం వైపుగా వెళుతున్న ప్రసాదరాజు కాన్వారు దగ్గరకి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సన్నివేశాన్ని ఇరువురు పార్టీల నాయకులు ఆసక్తిగా చూశారు.

➡️