భావనపాడులో వలలు దగ్ధం

Jun 18,2024 13:55 #Bhavanapadu, #burnt, #Nets

ప్రజాశక్తి – నౌపడ (శ్రీకాకుళం) : భావనపాడులో నాయకులు, మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్‌ గొరకుల ఆదినారాయణకు చెందిన రెండు వలలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారని మంగళవారం నౌపడ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీని విలువ రూ.12 లక్షలు పైగా ఉంటుందని, ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నారు. వేట విరామం సమయంలో … హార్బర్లో ఎప్పుడూ తను దాచుకున్న చోటే వలలు ఉంచానని మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి వలలు దగ్ధం ఉన్నాయని ఫిర్యాదుల పేర్కొన్నారు. గ్రామంలో దేవత ఉత్సవాలు జరుగుతున్నందున ప్రమాదవశాత్తు జరిగిందా.. లేదా ఎవరైనా ఉద్దేశ పూర్వకంగానే చేశారా అనేది తెలియడం లేదని వాపోయారు.

➡️