టెన్త్‌ సప్లిమెంటరీలో 62.21 శాతం ఉత్తీర్ణత

– ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేష్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా విడుదల చేశారు. మే 24 నుంచి జూన్‌ 10వ తేదీ వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు 1,07,883 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 67,115 (62.21 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు www.results.bse.ap.gov వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 27 నుంచి జులై ఒకటో తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

➡️