డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి:తహశీల్దారు

డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి:తహశీల్దారు

డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి:తహశీల్దారు ప్రజాశక్తి -రామచంద్రపురం: వర్షాలు నేపథ్యంలో మండలంలోని ప్రజలు డయేరియా, అంటు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల తహశీల్దార్‌ పి ఉషారాణి అన్నారు. బుధవారం మండలంలోని అనుపల్లి, బొప్పరాజు పల్లి, నెత్త కుప్పం, నూతగుంటపల్లి, సూరవారిపల్లి, కుప్పం బాదూరు గ్రామాలలోని పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి ట్యాంకులను బ్లీచింగ్‌ తో క్లీన్‌ చేసి క్లోరినేషన్‌ చేయాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందజేయాలన్నారు. గ్రామాలలో తాగునీటి పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని గ్రామ సచివాలయ సిబ్బందిని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పవన్‌ రాజ్‌ ఆదేశించారు. గ్రామపంచాయతీల ద్వారా గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాలల్లోని విద్యార్థులకు పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ మార్కండేయ నాయుడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ కష్ణమ్మ, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ పవన్‌ రాజు, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️