చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దు : కమిషనర్‌ రామలక్ష్మి

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దని మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులను కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి కోరారు. పట్టణంలోని మిలటరీకాలనీ, బోస్‌నగర్‌, రాజ్‌మహల్‌, రామన్నదొరవలసలో మంగళవారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ … చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించకుండా ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని చెప్పారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులకు చెత్త ఇవ్వాలని ప్రజలను కోరారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్మికుల పనిపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో మున్సిపల్‌ ఏఇ సురేష్‌, శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు.

➡️