ప్రజా సంక్షేమంతో రాజకీయాలు వద్దు

May 6,2024 21:40

ఎన్నికల ప్రచారంలో బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-మెరకముడిదాం   : ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలతో రాజకీయం చేయటం ప్రతి పక్షానికి తగదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు మీరు చేసే మంచిని చెప్పి ఓటు అడగాలని టిడిపికి సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి మండలంలోని బైరిపురం, ఉత్తరావిల్లి, బుదరాయ వలస గ్రామాల్లో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పార్టీ రహితంగా తమకు ఓటు వేయని టిడిపి వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. కాదని మీరు చెప్పగలరా? అని టిడిపి నాయకులను ప్రశ్నించారు. కుటుంబంలో మంచి జరిగితేనే తమకు ఓటేయాలని అడిగే దమ్ము తమకు ఉందని, టిడిపికి ఆ ధైర్యం ఉంటే అడగండి చూద్దాం అంటూ సవాల్‌ చేశారు. బైరిపురం గ్రామంలో జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ మండలంలో మారు మూల ప్రాంతాలకు రోడ్లు వేశామని,పాఠశాలలు, తాగునీరు, హాస్పిటల్స్‌ సచివాలయాలు, ఆర్‌బికెలు ఏర్పాటు చేశామని తెలిపారు. మళ్లీ వైసిపిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్‌ పప్పల విజయకుమారి, ఉప సర్పంచ్‌ పప్పల కృష్ణమూర్తి, వైస్‌ ఎంపిపి కందుల పార్వతి, సీనియర్‌ నాయకులు పప్పల గ్రహణేశ్వరావు, కందుల మల్లి, సింగారపు రామకృష్ణ, మండల నాయకులు తాడ్డి వేణు, పెద బాబు, కోట్ల వెంకటరావు, బూర్లె నరేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.ఫోటో. బైరిపురంలో సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ.

➡️