వెన్నుపూస గాయపడినా.. వీల్‌ చైర్‌లో నామినేషన్‌కు..!

Apr 23,2024 12:45 #chittore, #nomination, #TDP

ప్రజాశక్తి -ఎస్‌ఆర్‌ పురం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌ పురం మండలంలోని కటికపల్లి గ్రామపంచాయతీ కటికపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి శేఖర్‌కు ఇటీవల జరిగిన ప్రమాదంలో వెన్నుపూస గాయపడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో ప్రత్యేకంగా తయారు చేసుకున్న వీల్‌ చైర్‌ బ్యాటరీ సైకిల్‌ తో మంగళవారం టిడిపి గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ థామస్‌ నామినేషన్‌ వేయడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి శేఖర్‌ కటికపల్లి గ్రామం నుంచి తాను ప్రత్యేకంగా తయారు చేసిన వీల్‌ చైర్‌ బ్యాటరీ సైకిల్‌ మీద గంగాధర నెల్లూరు వరకు పార్టీ జెండాను కట్టుకొని కార్యకర్తలతో కలిసి వెళ్ళారు. అతనిని చూసి అందరూ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. అతనికి తెలుగుదేశం పార్టీ పైన ఉన్న అభిమానానికి నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. అతడి అభిమానాన్ని పలువురు కొనియాడారు.

➡️