ఉత్సవాల బ్రోచర్‌ ఆవిష్కరణ

Dec 13,2023 22:02

ప్రజాశక్తి – విజయవాడ : సాహిత్య,సాంస్కతిక సేవా సంస్ధ ‘శ్రీశ్రీ కళావేదిక’ అంతర్జాతీయ ఛైర్మన్‌ కత్తిమండ ప్రతాప్‌ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహించనున్న ”ప్రపంచ తెలుగు సాహిత్య, కళా ఉత్సవాలు 2023” బ్రోచర్‌ను ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం ఛైర్మన్‌ పి.విజయబాబు విజయ వాడలోని మాచవరంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి. విజయబాబు మాట్లాడుతూ ప్రతి నెలా ఒక్కోజిల్లాలో సాహిత్య,సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. తెలుగు భాషాభివధ్ధికి తోడ్పడే ప్రతీకార్యక్రమం కూడా స్పూర్తిదాయకమైనదేనన్నారు. శ్రీశ్రీ కళావేదిక ఉమ్మడి కష్ణాజిల్లా గౌరవాధ్యక్షులు, ప్రపంచ కళా ఉత్సవాల ఆర్గనైజింగ్‌ కమిటీ మెంబరు డా వ కే.ఆర్‌.జి.శేషుకుమార్‌ మాట్లాడుతూ ఈ నెల 16,17 తేదీలు శని,ఆదివారాలలో నాన్‌ స్టాప్‌ గా 30గంటల, 30నిమిషాల, 30సెకన్ల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 600 మందికి పైగా కవులు,రచయితలు,కళాకారులు, సాహిత్యాభిమానులు తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఈ బ్రోచర్‌ ఆవిష్కరణలో ఆంధ్రప్రదేశ్‌ దళిత్‌ లెక్చరర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు డావ కొల్లేటి రమేష్‌, శ్రీశ్రీ కళావేదిక యువజన విభాగం జిల్లా ప్రతినిధి దుంపల విజరు తదితరులు పాల్గొన్నారు.

➡️