మేథో సంపత్తి హక్కులపై అవగాహన పెంచుకోవాలి

Apr 29,2024 22:13

ప్రజాశక్తి – వన్‌టౌన్‌: మేథో సంపత్తి హక్కులపై అవగాహన పెంచుకోవటం ద్వారా మరింత ఆదాయాన్ని పొందవచ్చని కేంద్ర పెటెంట్లు అండ్‌ డిజైన్స్‌ జాయింట్‌ కంట్రోలర్‌ (చెన్నై) ఎం అజీత్‌ అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల ఫిజిక్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఐక్యూఏసీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ‘మేథో సంపత్తి హక్కులు’ అంశంపై వర్క్‌షాప్‌ను సోమవారం ఆ కళాశాల సెమినార్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ముఖ్యవక్తగా హజరైన ఎం అజీత్‌ మాట్లాడుతూ మేథో సంపత్తి హక్కులపై భారతదేశంలో చాలా వెనుకబాటు ఉందన్నారు. దేశానికి చెందిన అనేక ఉత్పత్తులపై ఇతర దేశాలు పెటెంట్లు పొందటం ద్వారా హక్కులను సాధించి ఆదాయాన్ని పొందుతున్నాయన్నారు. వివిధ సంస్థలు, వ్యక్తులు వారు రూపొందించిన ఆవిష్కరణలు, ఉత్పత్తులపై వారికి హక్కులు ఉంటాయన్నారు. వీటిని అధికారికంగా నమోదు చేయించుకోవటం ద్వారా ప్రపంచ వ్యాపితంగా మేథో సంపత్తి హక్కులను పొందవచ్చన్నారు.

➡️