అభ్యర్థుల కుటుంబీకుల ప్రచారం

May 4,2024 21:57
  • సెంట్రల్‌ సిపిఎం అభ్యర్థి సతీమణి ప్రచారం

ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబూరావు సతీమణి చిగురుపాటి సునంద సెంట్రల్‌ నియోజకవర్గం 61 డివిజన్‌ శాంతినగర్‌, 60 డివిజన్‌ జి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌లో పర్యటించారు. శనివారం పర్యటించారు. కాలనీలో ఇంటింటికి తిరిగి స్థానికులకు సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబూరావు ప్రజల కోసం పోరాడే వ్యక్తిని పిలిస్తే పలికే వ్యక్తిని విజయవాడ అభివృద్ధి కోసం పోరాడే వ్యక్తి అని అన్నారు. శాంతినగర్‌లో చేసిన పోరాటాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ చింతల్‌ శ్రీనివాస్‌ తిరుపతిరావు ఆర్‌ శివ పార్వతి సిహెచ్‌.అరుణ, ఎం.రమ ణమ్మ, ఎం.శివమ్మ, వెంకటేశ్వరరావు, మహేశ్వరి, భార్గవ్‌, 60వ డివిజన్‌ కార్యదర్శి ఎం.రత్నకుమారి స్థానిక నాయకులు ఎ.సుశీల వై.లలిత, పి.మరియమ్మ రాజేశ్వరి పాల్గొన్నారు. – పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు ప్రచారంప్రజాశక్తి – భవానీపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న సందర్భంలో కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలపై చట్ట సభల్లో ప్రశ్నించే కమ్యూనిస్టులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భవానీపురం ఐరన్‌ యార్డ్‌లో ముఠా కార్మికులతో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు చేసే వారు గెలిచిన తరువాత వాటిని సంపాదించుకోవటానికే ప్రయత్ని స్తారన్నారు. తాను కార్పొరేటర్‌గా పనిచేసిన కాలంలోనే ఐరన్‌ యార్డులో రోడ్లు, డ్క్రెనేజీ, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించటం జరిగిందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు ‘కంకి- కొడవలి’ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్‌ పత్రంలో సీరియల్‌ నంబర్‌ ఐదు గుర్తుంచుకోవాలన్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీహెచ్‌.బాబూరావుకు ‘సుత్తి- కొవడలి- నక్షత్రం’ గుర్తుపై, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నాంచారయ్యకు, విజయవాడ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్‌కు ‘హస్తం’ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సిఐటియు విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి సీతారాములు, ఏఐటీయూసీ విజయవాడ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై పోరాడేది వామపక్ష పార్టీలేనని స్పష్టం చేశారు. ముఠా కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాసరెడ్డి, శ్రీరామచంద్రమూర్తి, బత్తు తిరుపతయ్య, కన్నె వెంకటేశ్వర్లు, కష్ణ, కొండ, కబీర్‌ పాల్గొన్నారు.64వ డివిజన్లో సిపిఎం నాయకుల ప్రచారంసెంట్రల్‌ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఐద్వా సెంట్రల్‌ కార్యదర్శి జి ఝాన్సీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావును గెలిపించాలని పిలిస్తే పలికే నాయకులు కావాలని ప్రజల అవసరాలకు స్పందించే నాయకులు అవసరమని విజయవాడ అభివృద్ధి చెందాలంటే సిహెచ్‌.బాబురావును భారీ మెజార్టీతో గెలిపించాలని టిడిపి జనసేన వైసిపి బిజెపిని ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కమల వెంకటరెడ్డి పిచ్చమ్మ ఆంజనేయులు కష్ణ మౌనిక తదితరులు పాల్గొన్నారు.ఇండియా వేదిక అభ్యర్థి తాంతియా ప్రచారంప్రజాశక్తి – తిరువూరు : తిరువూరు మండలం, అక్కపాలెం, మునుకుళ్ల, వావి లాల, రాజుగూడెం, ఎర్రమాడు గ్రామాల్లో ఇండియా వేదిక బలపర్చిన కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ అభ్యర్ధి లాంతాంతియా కుమారి శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచార నిర్వహించారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం వస్తే ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని, అవినీతి లేని పరిపాలన అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాంబారు వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు నాగుల్‌ మీరా, కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యదర్శి పల్లిపాడు శ్రీనివాసరావు కడియాల నాగేశ్వరావు చక్రాల హరిబాబు పాల్గొన్నారు.కాంగ్రెస్‌ను గెలిపించండిప్రజాశక్తి – కంచికచర్ల : ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే కాంగ్రెస్‌ పార్టీనే గెలిపించాలని విజయవాడ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వల్లూరు భార్గవ్‌ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నందిగామ అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి మందా వజ్రయ్యతో కలిసి శనివారం కంచికచర్లలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా భార్గవ్‌ మాట్లాడుతూ భవిష్యత్తు మారాలంటే పాలన మారాలని తెలియజేస్తు ప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టోలో వివరాలతో కూడిన కరపత్రాలను అందజేశారు.ఇండియా వేదిక అభ్యర్థి ప్రచారంప్రజాశక్తి – మైలవరం : జి.కొండూరు మండలంలోని గడ్డ మణుగు, చెరువు మాధవరం, మునగపాడు, సున్నంపాడు, దుగ్గిరాలపాడు గ్రామాలలో శనివారం ఇండియా వేదిక మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బొర్రా కిరణ్‌ విస్తతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొర్రా కిరణ్‌, మైలవరం నియోజకవర్గం సిపిఎం ఇన్చార్జి పివి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. వైసిపి, టిడిపి జనసేనలకు ఎవరికి ఓటు వేసిన అది బిజెపి ఖాతాలోకి వెళ్తుందని అన్నారు. ఉదయభాను ప్రచారంజగ్గయ్యపేట : టిడిపి అధినేత చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, మరోసారి తప్పుడు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాడని దానిని ఎవరూ నమ్మవద్దని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను అన్నారు. మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట, గండ్రాయి గ్రామాల్లో ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయభాను మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిం చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. రాజగోపాల్‌ సతీమణి ప్రచారంప్రజాశక్తి – జగ్గయ్యపేట: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలన చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కొనసాగితే అన్ని వర్గాల వారికి సమన్యాయం సమకూరుతుందని టిడిపి, జనసేన, బిజెపి పార్టీల నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య సతీమణి శ్రీరాం శ్రీదేవి అమ్మాజీ అన్నారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని కాకాని నగర్‌, డాంగేనగర్‌ 41, 42, 43, 44 బూత్‌ లలో టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల మహిళల నాయకులతో కలిసి శ్రీరాం శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య ప్రచారంజగ్గయ్యపేట : ప్రచారంలో భాగంగా శనివారం మండలంలో తిరుమలగిరి, ధర్మవరప్పాడు తండ గ్రామాలలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి జాతీయ కోశాధికారి, తదితరులు పాల్గొన్నారు.

➡️