కల్వర్టుల పనులు వెంటనే ప్రారంభించాలి

May 18,2024 14:53 #East Godavari

ప్రజాశక్తి-కడియం (మండపేట)  : మండపేట నుండి ద్వారపూడి వెళ్లే రోడ్డు నిర్మాణంలో భాగమైన పంట కాలువలు పై ఉన్న కలవర్టు ల పనులు వెంటనే చేపట్టాలని డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎమ్మార్పీ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దూళి జయరాజు మాదిగ కోరారు. శనివారం స్థానిక పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. కాలువలు కట్టేసిన మరుక్షణమే పనులు మొదలు పెడతామని గతంలో ఆర్ అండ్ బి అధికారులు చెప్పారని, కాలువ నీరు కట్టేసి పది రోజులు కావస్తున్నా నేటికీ కలవర్టుల పని ప్రారంభించకపోవడం అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమేనని పేర్కొన్నారు.
పనులు పూర్తికాక ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే పనులు చేపట్టి కాలువలకు నీరు విడుదల చేసేనాటికి పూర్తి చేయాలని అధికారులను జయరాజు కోరారు.

➡️