ప్రచారాలు ముమ్మరం

Apr 25,2024 22:35

ప్రజాశక్తి – కంచికచర్ల : నందిగామ వైసిపి అభ్యర్థి డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు గురువారం కంచికచర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక మోడల్‌ కాలనీలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. 5 ఏళ్లలో జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్‌ రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. నందిగామలో గత పాలకులు అభివృద్ధి చేయకుండా దోచుకున్నారు. మరోసారి దోచుకోటానికి వస్తున్నారన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివద్ధి చెందిందన్నారు. నందిగామలో 5 ఏళ్లలో అభివధ్ధి చేశామన్నారు. ఎవరు ప్రజలకోసం పనిచేస్తారో బేరిజు వేసుకొని మంచి పాలకులను ఎన్నుకోవాలన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నందిగామను మరింత అభివృధ్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి అద్యక్షుడు వేమా సురేష్‌ బాబు, నాయకులు కాలవ పెదబాబు, నంబూరు పెదబాబు, గురయ్య తదితరులు పాల్గొన్నారు.కేశినేని చిన్ని, సౌమ్య ప్రచారంప్రజాశక్తి – నందిగామ : ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ విజయవాడ పార్లమెంటు కూటమి ఉమ్మడి అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (నాని) పేర్కొన్నారు. గురువారం నందిగామ పట్టణం ముక్కపాటి నగర్‌లో కూటమి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ అభ్యర్థి శివనాథ్‌ (చిన్ని) ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరిగి కరప త్రాలను పంచుతూ టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. చిన్ని మాట్లాడుతూ 9వ వార్డులో ప్రజలు చూపించే ఆదరణ వస్తుంటే భారీ మెజారిటీరి ఈ వార్డు నుంచి రాబోతుందన్నారు. విశ్వసనీయతతో పనిచేస్తా: స్వామి దాస్‌ప్రజాశక్తి – గంపలగూడెం : తిరువూరు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి నల్లగట్ల స్వామి దాసు తెలిపారు. దాస్‌ గురువారం మండలంలోని లింగాల సుబ్బాల ఆర్లపాడు తదితర గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిదాసు ఓటర్లను ఉద్దేశించి పలు గ్రామాల్లో ప్రసంగిస్తూ, అందరిలా రాజకీయాలు చేయనని, ప్రజలకు చేరువలో ఉండి పనిచేస్తానని చెప్పారు. అబద్ధాలు చెప్పడం చాతరాదన్నారు. ఎన్నికల్లో తనపై ఎక్కడినుండో వలస పక్షులను తెచ్చి పోటీ చేయిస్తున్నారని చెప్పారు. అటువంటి పక్షులను ప్రజలు ఆదరించరని అన్నారు. స్వామి దాసు సతీమణి తన విజయాన్ని కాంక్షిస్తూ దుందిరాలపాడు గ్రామంలో పర్యటించి, ఓట్లను అర్ధించారు.కులాల మధ్య చిచ్చుపెడుతున్న కూటమిని ఓడించాలి- సీపీఐ పశ్చిమ అభ్యర్థి జి.కోటేశ్వరరావు ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో తన స్వార్థ రాజకీయాల కోసం బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఇండియా కూటమి బలపరిచిన సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను ప్రజలు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. జి.కోటేశ్వరరావు గురువారం 49, 50 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ కులాల వారీగా, మతాల వారీగా మీటింగ్‌లు పెట్టి ప్రజలను చీల్చి ఓట్లు పొందాలని కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు పన్నుల భారం లేని, వివక్ష లేని పారదర్శక పాలన కోసం ఇండియా వేదిక బలపరిచిన కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ కార్పొరేటర్‌ గాదె ఆదిలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పేదలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రూపాయికే టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని మభ్య పెట్టి ఓట్లు దండుకుని ఐదేళ్లలో ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని చెప్పారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నక్కా వీర భ ద్రరావు, తాడి పైడయ్య, పంచదార్ల దుర్గమ్మ, సిపిఎం 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోయి సత్యబాబు, కొండా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కేశినేని నాని, ఆసిఫ్‌ ప్రచారంప్రజాశక్తి – వన్‌టౌన్‌ : చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు, మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఎవ్వరూ నమ్మవద్దని వైసిపి విజయవాడ ఎం.పి అభ్యర్థి కేశినేని నాని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం వైసిపి 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపిళ్లా రాజేష్‌ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ వైసిపి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌తో కలిసి విజయవాడ వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థి ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని), నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వసంత కృష్ణ సతీమణి ప్రచారంప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి డౌన్‌లో గురువారం టిడిపి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు విజయాన్ని కాంక్షిస్తూ సతీమణి శీరిష విస్తతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం సాయంత్రం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

➡️