పలుచోట్ల అభ్యర్థుల ప్రచారాలు

May 5,2024 21:46
  • నిత్యం ప్రజల మధ్య ఉండే కమ్యూనిస్టులను ఆశీర్వదించండి-
  • సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావును గెలిపించండి-
  • బాప్టిస్టు చర్చి పెద్దలకు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ విజ్ఞప్తి

భారతదేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా వేదికను ఆదరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ కోరారు. నిత్యం ప్రజల మధ్య ఉండే కమ్యూనిస్టులను ఆశీర్వదించాలని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండియా వేదిక బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రైజర్‌పేట తెలుగు బాప్టిస్టు చర్చి పెద్దలతో జల్లి విల్సన్‌, జి.కోటేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జల్లి విల్సన్‌ మాట్లాడుతూ బాప్టిస్టు సంఘంతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఇక్కడి ప్రజలతో గల ఆత్మీయ సంబంధాలను గుర్తుచేసు కున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్‌, సీపీఎం మద్దతుతో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్‌ నాసర్‌వలీని అందరూ ఆశీర్వదించి 30వేల ఓట్లతో గెలిపించారని గుర్తుచేశారు. నేడు మోడీ చెబుతున్న డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ 2004లోనే కమ్యూనిస్టుల సహకారంతో కేంద్రంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని తెలిపారు. నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కేంద్రంలో సోనియా గాంధీ ఆశీస్సులతో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రి అయ్యారని, అనేక మంచి పనులు చేశారని పేర్కొన్నారు. నేడు మళ్లీ అదే తరహాలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం కలిసి ఇండియా వేదికగా ఏర్పడి పోటీ చేస్తున్నాయని వివరించారు. విద్యాధికుడు, స్థానికుడు, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి అయిన జి.కోటేశ్వరరావు పోటీ చేస్తున్నారని, గెలిపించాలని కోరారు. జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెబుతున్న డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వల్ల అభివద్ధి కాదు. అరాచకాలు పెరిగిపోయాయని చెప్పారు. బాప్టిస్టు చర్చి ఆధ్వర్యాన నిర్మిస్తున్న కమ్యూనిటీ హాలుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో బాప్టిస్టు సంఘ పాస్టర్‌ రెవరెండ్‌ కొమ్ము నిక్సన్‌ ఆండ్రూస్‌, స్టాండిరగ్‌ కమిటీ చ్కెర్మన్‌ రెడ్డిబోయిన మోజెస్‌, కార్యదర్శి వినుకొండ ఇమ్మానుయేల్‌, సంయుక్త కార్యదర్శి బూదాల విక్టర్‌ జోసఫ్‌, కోశాధికారి దారివేముల ఏలియాబాబు, సంయుక్త కోశాధికారి కటికల కిశోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్‌ అభ్యర్థి వజ్రయ్య ప్రచారంప్రజాశక్తి – చందర్లపాడు : చందర్లపాడు మండలంలో ఇండియా వేదిక బలపరచిన నందిగామ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మందా వజ్రయ్య ఆదివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. బొబ్బెళ్లపాడు గ్రామంలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఉదయం 7 గంటల నుంచి బొబ్బెలపాడు గ్రామంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో నందిగామ అసెంబ్లీ నియోజవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందా వజ్రయ్య, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి వేల్పుల శివకృష్ణ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సీనియర్‌ నాయకులు సుడిగాలి పర్యటన చేసి హస్తం గుర్తుపై ఓటు వేసి విజయవాడ పార్లమెంటు అభ్యర్థి వల్లూరి బార్గవ్‌, నందిగామ నియోజకవర్గం కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి మందా వజ్రయ్య గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రచారంప్రజాశక్తి – నందిగామ : పెన్షన్ల పంపిణీపై జగన్‌ ప్రభుత్వం పన్నిన పన్నాగం వల్ల వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్నారని నందిగామ అసెంబ్లీ కూటమి అభ్యర్థి తంగిరాల ఆరోపించారు. ఆదివారం నందిగామ శివారు హనుమంతపాలెం గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంశపారపర్యంగా తాతముత్తాతలు ఇచ్చిన ఆస్తుల తాలుకా పాస్‌పుస్తకాలపై జగన్‌రెడ్డి బొమ్మ వేయించుకుని ఆస్తి పత్రాలను జిరాక్స్‌ కాఫీలుగా మార్చడం దుర్మార్గమన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతులకు ఎలాంటి రక్షణ ఉండదని తెలిపారు. ఈసారి జగన్‌ గెలిస్తే ప్రభుత్వ ఆస్తులను, సచివాలయాన్ని తనఖాపెట్టినట్లు రైతుల భూములను కూడా తాకట్టు పెడతారని తెలిపారు. అసెంబ్లీకి తనకు, పార్లమెంట్‌ అభ్యర్థిగా కేశినేని శివనాథ్‌ (చిన్ని)కు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపంచాలని విజ్ఞప్తి చేశారు.’ఎన్డీఏతోనే యువతకు ఉపాధి’ప్రజాశక్తి – గంపలగూడెం : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే యువతకు ఉపాధి కల్పన సాధ్యపడుతుందని రాష్ట్ర టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి చావా సతీష్‌ కుమార్‌ తెలిపారు. మండలంలోని అమ్మిరెడ్డిగూడెం గ్రామంలో హారు అన్న ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించి, వివరించారు. ఐదేళ్ల పాలనలో జగన్మోహన్‌ రెడ్డి ఉపాధిలో విఫలమయ్యారని తెలిపారు. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటేసి అభ్యర్థులను గెలిపించాలన్నారు. టిడిపి అభ్యర్థి శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేట : ప్రచారంలో భాగంగా మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట, చిల్లకల్లు గ్రామాలలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం రాత్రి టిడిపి జాతీయ కోశాధికారి, జగ్గయ్యపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాతయ్య మాట్లాడుతూ ఎన్నికలలో తమ పవిత్రమైన ఓటును సైకిల్‌ గుర్తుపై వేసి రాష్ట్రంలో నడుస్తున్న వైసిపి అరాచక పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సంబంధించిన భూములను లాక్కోవాలని చూస్తున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.శ్రీరాం కుటుంబం ప్రచారంజగ్గయ్యపేట: పట్టణంలోని 30వ వార్డు కనపర్తి నగర్‌, విజ్ఞాన్‌ నగర్‌లలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య సతీమణి శ్రీరాం శ్రీదేవి అమ్మాజీ, శ్రీరాం చిన్నబాబు సతీమణి శ్రీరాం శ్రీవల్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నికి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్యకి ఓటు వేయాలని కోరారు.వైసిపి హయాంలోనే నియోజకవర్గ అభివద్ధి: ఎమ్మెల్యే జగన్‌ మోహన్‌ రావుప్రజాశక్తి – నందిగామ : ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ఆదివారం చౌటపల్లి, గూడెం మాధవరం, కొడవటికల్లు, పొన్నవల్లి గ్రామాల్లో నందిగామ వైసిపి అభ్యర్థి, ఎమ్మెల్యే మొండితోక జగన్‌ మోహన్‌ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న మేనిఫెస్టోకే ప్రజల విశ్వసనీయత ఉందన్నారు. చంద్రబాబు బూటకపు మాటలను ప్రజలు నమ్మరు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల సభ్యుల ఇళ్ల చుట్టూ మీరు తిరిగారా అని ప్రశ్నించారు.సామినేని గెలుపునకు ప్రచారంప్రజాశక్తి – వత్సవాయి : మండలంలోని మక్కపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామంలోని నాయకులను కలిసి గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలు గురించి, సమస్యల గురించి తెలుసుకొని, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని సామినేని ఉదయభాను నాయకత్వం బలపరచాలని, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని వైసిపిని ఆశీర్వదించాలని కరిసే మధు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో మండల నాయకులుప్రజాశక్తి – విస్సన్నపేట : విస్సన్నపేట శివారు కోలేటి దళితవాడలోని ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, మోడీ ప్రవేశపెట్టిన సూపర్‌ 6 పథకాలను వివరిస్తూ విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని), తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొలిక పూడి శ్రీనివాసరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో మండల కూటమి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్‌ నాయకులు ఎన్‌టి.వెంకటేశ్వరరావు, నెక్కళపు శ్రీనివాసరావు (డాబా శ్రీను), డాక్టర్‌ నెక్కళపు కృష్ణ చైతన్య, యువ నాయకులు అనుమోలు శివ బాజీ, వెంగల వెంకటరామయ్య, బీజేపీ నాయకులు లాం కొండలరావు, తెలుగుయువత నాయకులు మేకల నాగారాజు, శ్రీనివాసరావు, కోలేటి లక్ష్మయ్య, కోలేటి వెంకటరావు, కంచర్ల కొండలరావు, మొలుగుమాటి పుల్లయ్య, శీలం నాని పాల్గొన్నారు.కంచికచర్లలో వైసిపి ఇంటింటి ప్రచారంప్రజాశక్తి – కంచికచర్ల : నందిగామ వైసిపి అభ్యర్ధి డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావుకు మద్దతుగా ఆదివారం కంచికచర్లలో వైసిపి నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణ వైసిపి అధ్యక్షుడు వేమా సురేష్‌ బాబు ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్‌ బంక్‌ సెంటర్‌, హనుమాన్‌ పేటలో ఇంటింటికీ తిరిగి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి డాక్టర్‌ జగన్మోహన్‌ రావును రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గడచిన 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే డాక్టర్‌ జగన్మోహన్‌రావు సహకారంతో కంచికచర్లలో సిసి రోడ్ల, పక్కా డ్రైనేజీ సమస్యలతో పాటు మౌలిక సదుపాయాల కల్పించినట్లు తెలిపారు. వైసిపి హయాంలోనే కంచికచర్ల అభివృద్ధి జరిగిందన్నారు. రానున్న రోజూల్లో సమస్యల పరిష్కారం కావాలంటే చిత్తశుధ్ధితో పనిచేసే డాక్టర్‌ జగన్మోహన్‌ రావును గెలిపించాలని విజ్ఞాప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనుమోలు వాసు, దాసరి రాము, ఆదిత్య, శేషం వాసు, గురవయ్య, నారిశెట్టి శ్రీను, దేవిరెడ్డి శ్రీను, పొన్నపల్లి శ్రీను పాల్గొన్నారు.

➡️