మెరిట్‌ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు

May 18,2024 19:24
  • అందజేసిన ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు

ప్రజాశక్తి – జగ్గయ్యపేట : పట్టణంలోని గ్రేడ్‌ 1 గ్రంథాలయంలో శనివారం యుటిఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా సహాధ్యక్షులు ఎం.కృష్ణయ్య అధ్యక్షతన జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు చేతుల మీదుగా విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ పదో తరగతి అనంతరం విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణ కలిగి ఉండి ఒక ప్రణాళికబద్దంగా చదివితే జీవితంలో ఒక మంచి స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుందని, పదో తరగతి పాస్‌ అయిన విద్యార్థులు త్రిబుల్‌ ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి కోర్సు పూర్తి చేసినట్లయితే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెనుగంచిప్రోలు మండల స్థాయి విద్యార్థులకు జిల్లేపల్లి నాగరత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు జిల్లేపల్లి సుధానంద్‌ సౌజన్యంతో జగ్గయ్యపేట మండల స్థాయి విద్యార్థులకు దారా పుల్లయ్య (రిటైర్డ్‌ కోర్టు ఉద్యోగి) జ్ఞాపకార్థం వారి కుమార్తె దారా కోమలి సౌజన్యంతో మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల విద్యాశాఖాధికారి ఎల్‌ నాగరాజు, గ్రంథాలయ అధికారిణి ఆలేటి ప్రభ, యుటిఎఫ్‌ నాయకులు ఎం కష్ణయ్య, జె.సుధానంద్‌, షేక్‌ హుస్సేన్‌, జి పల్లవి, జి ముక్తేశ్వరరావు, అల్లిక నరసింహారావు, జి ప్రవీణ్‌, మణిమాల రమణ, వి సుందర రావు, ఎస్‌ విద్యాసాగర్‌, దోసపాటి నాగేశ్వరరావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️