అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్ట్‌ల తనిఖీ

May 7,2024 21:51

జగ్గయ్యపేట: జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ గట్టి నిఘా ఉంచాలని విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి.జస్టిన్‌ అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి జస్టిన్‌ మంగళవారం నందిగామ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సరిహద్దు జొన్నలగడ్డ, చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గండ్రాయి, వత్సవాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వత్సవాయి ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ లను ఆకస్మికంగా పరిశీలించారు. చెక్‌ పోస్ట్‌ వద్ద అధికారులు నమోదు చేస్తున్న రికార్డులు, వాహనాల తనిఖీ తదితర ప్రక్రియను పరిశీలించారు. చెక్‌ పోస్టుల వద్ద అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలించాలన్నారు.

➡️