ఎన్నికల సిబ్బందితో జెసి సమీక్ష

Apr 15,2024 22:16

ప్రజాశక్తి – మైలవరం : సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్న పలు బృందాలతో సోమవారం స్థానిక లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాయింట్‌ కలెక్టర్‌, మైలవరం రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో అలసత్వం, బాధ్యతారాహిత్యం కనపరచొద్దని హెచ్చరించారు. ఎటువంటి అనివార్య సంఘటనలు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా పనిచేయాలన్నారు. హోమ్‌ ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎసిపి, మైలవరం నియోజకవర్గం ఎఇఆర్‌ఒలు, ఎంపిడిఒలు, ఎంసిసి టీమ్‌లు, ఎఇఒ, సెక్టార్‌ ఆఫీసర్లు, సెక్టార్‌ పోలీసు ఆఫీసర్లు, పాల్గొన్నారు.

➡️